Thursday, December 19, 2024

గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్టు

- Advertisement -
- Advertisement -

తంగళ్లపల్లి : మండలంలోని మండెపల్లిలో గల కేసిఆర్ డబుల్ బెడ్ రూంల వద్ద అక్రమంగా గంజాయి సేవిస్తు తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అ రెస్టు చేశారు. ఈ మేరకు సిరిసిల్ల రూరల్ సిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. గంజాయి అమ్ముతున్నారన్న సమాచారంతో తంగళ్లపల్లి ఎస్‌ఐ లకా్ష్మరెడ్డి తన సిబ్బంది నరేందర్, సంపత్‌తో కలిసి అక్కడికి వెళ్లగా ఆ ప్రాంతంలో అనుమానస్పదంగా ఒక వ్యక్తి తిరుగుతూ కనిపించగా, అతన్ని పట్టుకుని తనిఖీ చేయగా అతని వద్ద 230 గ్రాముల గంజాయి దొరికిందని తెలిపారు.

అట్టి వ్యక్తిని విచారించగా వేములవాడ మండలం నాంపల్లి గ్రామానికి చెందిన వడిచర్ల జాన్ ప్రతాప్‌రెడ్డిగా గుర్తించారు. గంజాయి తాగడమే కాకుండా అమ్ముతాడని, ఇతని మీద వివిధ పోలీస్ స్టేషన్‌లో కేసులు ఉన్నాయని, అట్టి వ్యక్తిని అరెస్టు చేసి 230 గ్రాములు గంజాయి స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపించినట్లు సిఐ ఉపేందర్ తెలిపారు.

యువత గంజాయి లాంటి మత్తు పదార్దాలను సరఫరా చేయడం తాగడం చట్టరీత్యా నేరమని, గంజాయి సంబంధిత సమాచారం ఉంటే సంబంధిత పోలీస్ వారికి లేదా డయల్ 100కి సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News