Monday, December 23, 2024

రెండున్నర ఏళ్లలో విదేశాలకు చెక్కేసిన 28లక్షల మంది భారత పౌరులు!

- Advertisement -
- Advertisement -

 

 

Indians gone abroad

న్యూఢిల్లీ: గడిచిన రెండున్నరేళ్లలో ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం 28 లక్షల మందికి పైగా భారతీయులు విదేశాలకు వెళ్లి పోయినట్లు  తాజాగా కేంద్రం వెల్లడించిన డేటా ద్వారా తెలిసింది. ఇలా ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన వారిలో 4.16లక్షల మంది ఈసిఆర్ (Emigration Check Required) దేశాలకు వెళ్లిన్నట్లు కేంద్రం తెలిపింది.  లోక్‌సభలో విదేశాంగ మంత్రిత్వశాఖ లిఖితపూర్వకంగా 2020 జనవరి నుంచి 2022 జూలై వరకు…. రెండున్నరేళ్లలో విదేశాలకు వెళ్లిపోయిన భారతీయ పౌరుల వివరాలను వెల్లడించింది.

కేంద్రం వెల్లడించిన డేటా ప్రకారం 2020లో 7.15 లక్షల మంది, 2012లో 8.33 లక్షల మంది, 2022 జూలై వరకు 13.02 లక్షల మంది విదేశాలకు వెళ్లిపోయారు. ఇలా ఈ రెండున్నరేళ్లలో మొత్తం 28.51 లక్షల మంది విదేశాలకు వెళ్లిపోయారు. విదేశాలకు వెళ్లేవారి వీసాలు, వారు చెప్పిన వివరాల ఆధారంగా ఈ డేటాను సేకరించినట్లు సమాచారం. వీరిలో అత్యధికంగా 1.31లక్షల (32శాతం) మంది యూపీ నుంచే వెళ్లారు. ఆ తర్వాత స్థానాల్లో బిహార్ (69,518), బెంగాల్ (32,630), రాజస్థాన్ (31,204), తమిళనాడు (26,015), కేరళ (25,302), ఆంధ్రప్రదేశ్ (18,275), పంజాబ్ (14,255), తెలంగాణ (13,401) ఉన్నాయి.  కేంద్రం చెప్పిన వివరాల ప్రకారం 17 దేశాలకు ఇమ్మిగ్రేషన్ క్లీయరేన్స్ అవసరం ఉంటుంది. ఆఫ్గానిస్థాన్, బహ్రెయిన్, ఇరాక్, ఇండోనేషియా, సౌదీ అరేబియా, కువైట్, జోర్డాన్, లిబియా, లెబనాన్, మలేషియా, ఒమన్, ఖతర్, సుడాన్, సిరియా, థాయిలాండ్, యూఏఈ, యెమెన్‌కు ఇమిగ్రేషన్ క్లీయరేన్స్ తప్పనిసరి. 1983 ఇమిగ్రేషన్ చట్టం ప్రకారం… భారతీయ పౌరులకు విదేశాలకు వెళ్లేందుకు ఇమిగ్రేషన్ క్లీయరేన్స్ తప్పనిసరి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News