Monday, January 20, 2025

మరమ్మతుల కారణంగా తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రయాణించే పలు రైళ్ల రద్దు

- Advertisement -
- Advertisement -
ఈనెల 23వ తేదీ వరకు ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకోవాలి:  దక్షిణ మధ్య రైల్వే

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రయాణించే పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. విజయవాడ, సికింద్రాబాద్, హైదరాబాద్ డివిజన్ పరిధిలో మరమ్మతుల పనుల కారణంగా పలు రైళ్లను ఈ నెల 23వ తేదీ వరకు అధికారులు రద్దు చేశారు. మరికొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేయగా, మరికొన్నింటిని దారి మళ్లీంచనున్నట్లు దక్షిణమధ్య రైల్వే తెలిపింది. విజయవాడ- బిట్రగుంట (ట్రైన్ నెంబర్. 07978) ఈ రైలు 16వ తేదీ నుంచి 22వ తేదీ వరకు రద్దు చేయగా, బిట్రగుంట-  విజయవాడ (07977), బిట్రగుంట- ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ (17237), చెన్నై సెంట్రల్ -బిట్రగుంట (17238), రాజమండ్రి -విశాఖపట్నం (07466), విశాఖపట్నం -రాజమండ్రి(07467), కాకినాడ పోర్ట్- విశాఖపట్నం (17267), విజయవాడ -విశాఖపట్నం(22702), విశాఖపట్నం -విజయవాడ(22701), విశాఖపట్నం -కాకినాడ పోర్ట్(17268), విజయవాడ- గూడూరు(07500) రైళ్లను 17వ తేదీ నుంచి 23వ తేదీ వరకు రద్దు చేశారు. దీంతోపాటు గూడురు- విజయవాడ(07458) రైలును 18వ తేదీ నుంచి 24వ తేదీ వరకు రద్దు చేసినట్లు సౌత్ సెంట్రల్ అధికారులు పేర్కొన్నారు.
విజయవాడ- గుంటూరుల మధ్య
ఇక నర్సాపూర్-గుంటూరు(17282), గుంటూరు- నర్సాపూర్ (17281) రైలును ఈ నెల 17వ తేదీ నుంచి 23వ తేదీ వరకు విజయవాడ-గుంటూరుల మధ్య పాక్షికంగా రద్దు చేశారు. ధన్బాద్- అల్లెప్పీ(13351) రైలును 18,21,22వ తేదీల్లో, హటియా-బెంగళూరు (12835) రైలును 18వ తేదీన, టాటా  -బెంగళూరు(12889) 21వ తేదీన, హటియా -బెంగళూరు(18637) రైళ్లను 22వ తేదీన నిడదవోలు, భీమవరం, గుడివాడ, విజయవాడ మీదుగా మళ్లీంచనున్నట్టు దక్షిణమధ్య రైల్వే తెలిపింది.
హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో …
అటు హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో పనుల కారణంగా 17వ తేదీ నుంచి 23వ తేదీ వరకు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే స్పష్టం చేసింది. కాజీపేట -డొర్నకల్ (07753), డొర్నకల్ -కాజీపేట (07754), డొర్నకల్- విజయవాడ(07755), విజయవాడ-డొర్నకల్(07756), భద్రాచలం- విజయవాడ(07278), విజయవాడ- భద్రాలచం(07979), సికింద్రాబాద్- వికారాబాద్(07591), వికారాబాద్ -కాచిగూడ(07592), సికింద్రాబాద్ -వరంగల్(07462), వరంగల్- హైదరాబాద్(07463), సిర్పూర్ టౌన్- కరీంనగర్(07766), కరీంనగర్- సిర్పూర్ టౌన్(07765), కరీంనగర్- నిజామాబాద్(07894), నిజామాబాద్ -కరీంనగర్(07793), కాజీపేట- సిర్పూర్ టౌన్(17003), బలహర్షా- కాజీపేట్ (17004) రైళ్లు 23వ తేదీ వరకు రద్దయ్యాయని అధికారులు తెలిపారు. ఇక భద్రాచలం -బలహర్షా(17033), సిర్పూర్ టౌన్-భద్రాచలం(17034), కాజీపేట్ -బలహర్షా(17035), బాలహర్షా- కాజీపేట్(17036), కాచిగూడ- నిజామాబాద్(07596), నిజామాబాద్- కాచిగూడ(07593), నాందేడ్- నిజామాబాద్(07854), నిజామాబాద్- నాందేడ్(17033) రైళ్లు 17వ తేదీ నుంచి 23వ తేదీ వరకు దక్షిణమధ్య రైల్వే రద్దు చేసింది.
22 ఎంఎంటిఎస్ రైళ్లు రద్దు
నేటి నుంచి ఈనెల 23వ తేదీ వరకు అంటే వారం రోజుల పాటు పలు ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లుగా దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్ డివిజిన్ పరిధిలో మరమ్మతుల పనుల కారణంగా మొత్తం 22 రైళ్లను రద్దు చేస్తున్నట్లుగా తెలిపింది. ప్రయాణికులు ప్రత్యామ్నాయ రవాణా మార్గాలను ఎంచుకోవాలని సూచించింది. రద్దు చేసిన వాటిల్లో లింగంపల్లి- టు హైదరాబాద్ మధ్య నడిచే రైళ్లు 12 ఉండగా మిగతావి లింగంపల్లి- టు ఉందానగర్ మధ్య నడిచే రైళ్లు ఉన్నాయి. లింగంపల్లి- టుహైదరాబాద్ (47129, 47132, 47133, 47135, 47136, 47137) రైళ్లతో పాటు హైదరాబాద్ టు లింగంపల్లి (4711447105, 47108,47109, 47110, 47112) రైళ్లను అధికారులు రద్దు చేశారు. ఇక ఉందానగర్ టు -లింగంపల్లి(47165), లింగంపల్లి- టు ఫలక్‌నుమా(47189), లింగంపల్లి- టు ఉందానగర్ (47178,47181), లింగంపల్లి- టు ఫలక్‌నుమా(47179), ఫలక్‌నుమా టు లింగంపల్లి(47158) ఎంఎంటీస్ ట్రైన్లు రద్దు అయ్యాయని దక్షిణమధ్య రైల్వే పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News