Friday, December 27, 2024

ఈ నెల 25 నుంచి 29 వరకు పలు రైళ్ల దారి మళ్లింపు

- Advertisement -
- Advertisement -
వారం రోజుల పాటు 16 సర్వీసుల రద్దు

మనతెలంగాణ/హైదరాబాద్: సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో మూడో లైను నిర్మాణ పనులు చేపట్టడంతో ఈనెల 25వ తేదీ నుంచి 29వ తేదీ వరకు పలు రైళ్లను దారి మళ్లించినట్టు రైల్వే అధికారులు తెలిపారు. ఈ క్రమంలో ఎపి ఎక్స్‌ప్రెస్, స్వర్ణజయంతి, గాంధీథాం రైళ్లను వయా విజయనగరం, రాయపూర్, నాగపూర్ మీదుగా మళ్లీంచినట్టు దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. విశాఖ -న్యూఢిల్లీ ఎపి ఎక్స్‌ప్రెస్ (20805), న్యూఢిల్లీ -విశాఖ (20806) ఎపి ఎపి ఎక్స్‌ప్రెస్ మార్గంలో దారి మళ్లీస్తారు. సెప్టెంబర్ 14, 21 తేదీల్లో విశాఖ -గాంధీథాం ఎక్స్‌ప్రెస్ (20803), సెప్టెంబర్ 24వ తేదీన గాంధీథాం- విశాఖ ఎక్స్‌ప్రెస్ (20804) నడుస్తుందని అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 22, 25 తేదీల్లో విశాఖ- నిజాముద్దీన్ స్వర్ణజయంతి ఎక్స్‌ప్రెస్ (12803) నడువనుందని దక్షిణమధ్య రైల్వే తెలిపింది. సెప్టెంబర్ 20, 24 తేదీల్లో నిజాముద్దీన్ -విశాఖ స్వర్ణ జయంతి ఎక్స్‌ప్రెస్(12804) రైళ్లు వయా విజయనగరం, నాగపూర్ మీదుగా రాకపోకలు సాగిస్తాయని, అదేవిధంగా పూరి- ఓకా ఎక్స్‌ప్రెస్ (20819) సెప్టెంబర్ 24వ తేదీన వయా విజయనగరం, నాగపూర్ మీదుగా నడుపనున్నట్టు దక్షిణమధ్య రైల్వే తెలిపింది.
హైదరాబాద్- టు లింగంపల్లి మధ్య 10 రైళ్లు
దక్షిణ మధ్య రైల్వే అధికారులు వారం పాటు 16 సర్వీసులను రద్దు చేశారు. ఈనెల 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు 16 సర్వీసులను అధికారులు పూర్తిగా రద్దు చేశారు. వాజానగర్ నుంచి లింగంపల్లికి వెళ్లే రైలు నంబర్ (47165) సమయం మార్చినట్టు దక్షిణమధ్య రైల్వే తెలిపింది. ఈ రైలు ఈ వారం వాజా నగర్ నుంచి ఉదయం 8.50 గంటలకు బయలుదేరుతుందని అధికారులు వెల్లడించారు. రద్దు చేసిన ఎంఎంటీఎస్ సర్వీసుల్లో హైదరాబాద్- టు లింగంపల్లి మధ్య 10 రైళ్లు నడుస్తుండగా, లింగంపల్లి- టు ఫలక్‌నుమా మధ్య నడిచే మూడు రైళ్లు, వాజానగర్- టు లింగంపల్లి మధ్య నడిచే మూడు రైళ్లను రద్దు చేశారు. స్టేషన్లలో రద్దు చేయబడిన రైళ్ల సమయాలు, క్యారేజీ నంబర్లను ప్రదర్శిస్తామని దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సిహెచ్ రాకేష్ తెలిపారు.
బలార్షా సెక్షన్‌లో మూడో లైన్ ఇంటర్‌లాకింగ్ కారణంగా
మరోవైపు కాజీపేట రైల్వే జంక్షన్‌లోని బలార్షా సెక్షన్లో మూడో లైన్ ఇంటర్‌లాకింగ్, నాన్ ఇంటర్‌లాకింగ్ పనుల కారణంగా ఆగస్టు 29వ తేదీ నుంచి ఇంటర్‌సిటీ, భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ అనే రెండు రైళ్లను బెల్లంపల్లికి కుదించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఆగస్టు 29వ తేదీ నుంచి సెప్టెంబర్ 26వ తేదీ వరకు హైదరాబాద్ టు సిర్పూర్ కాగజ్‌నగర్‌ల మధ్య నడిచే ఇంటర్‌సిటీ రైలు, సికింద్రాబాద్- టు బలార్ష మధ్య నడిచే భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ రైలు సిర్పూర్ కాగజ్‌నగర్, రెండు ప్రధాన రైల్వే స్టేషన్లలో మూడో లైన్ పనులు జరుగుతున్నందున బెల్లంపల్లికి కుదించినట్లు వెల్లడించారు. బెల్లంపల్లి- టు బలార్ష సెక్షన్ మూడో లైన్ పనులు పూర్తి కావస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ రైళ్లు ఎలాంటి మార్పులు లేకుండా బెల్లంపల్లి వరకు మాత్రమే నడుస్తాయని అధికారులు వివరించారు. దీంతో పాటు గతంలో రద్దు చేసిన రామగిరి, సింగరేణి, డోర్నకల్ ప్యాసింజర్, కాకతీయ రైళ్ల రద్దును అక్టోబర్ 2వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News