Thursday, January 23, 2025

వివాహిత ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

కుంటాల : జీవితంపై విరక్తి చెంది వివాహిత్య ఆత్మహత్య  చేసుకుంది .ఈ సంఘటన మండలంలోని లింబా(బి) గ్రామాంలో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ హన్మాండ్లు,కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం…అంబకంటి శ్రీలత (30) అనే మహిళ మంగళవారం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. శ్రీలతకు సారంగాపూర్ మండలం ఆలూరు గ్రామానికి చెందిన వ్యక్తితో 12 ఏళ్ల క్రితం వివాహం అయింది. అయితే కొన్ని రోజుల క్రితం ఆమె తన సొంత ఊరిలో నాన్న వద్ద ఉంటూ బీడీ కార్మికురాలిగా పనిచేస్తుంది. మృతురాలికి భర్తతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News