Thursday, January 23, 2025

హాలీవుడ్ తరహాలో ఆకట్టుకుంటున్న “ఏ మాస్టర్ పీస్”

- Advertisement -
- Advertisement -

“శుక్ర”, “మాటరాని మౌనమిది” చిత్రాలతో ప్రతిభ గల దర్శకుడిగా పేరు తెచ్చుతున్న సుకు పూర్వాజ్. కమర్షియల్ గా రెండు చిత్రాలు విజయవంతం అయ్యాయి. ఈ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ తాజాగా తన మూడో సినిమా “ఏ మాస్టర్ పీస్” కు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. సూపర్ హీరో బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించనున్న ఈ చిత్రాన్ని సినిమా బండి ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీకాంత్ కండ్రేగుల నిర్మిస్తున్నారు.

మంగళవారం ఈ సినిమా హీరో సూవర్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సారి దర్శకుడు ఈ సినిమా ను హాలీవుడ్ రేంజ్ లో సరికొత్త కంటెంట్, ప్రెజంటేషన్ తో రూపొందనున్నట్లు పోస్టర్ చూస్తే తెలుస్తోంది. తమ సూపర్ హీరో ఎలా ఉండబోతున్నాడో తను ఎలా చూపించబోతున్నాడో ఒక్క పోస్టర్ తో చెప్పాడు దర్శకుడు. పిల్లలకు ఎంతో ఇష్టమైన సూపర్ హీరోను మన తెలుగు ప్రేక్షకుల కు కూడ పరిచయం చేస్తూ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా
చిత్రికరించబోతున్నాం అంటూ తెలియజేశారు దర్శకులు.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసుకొని ఈ జనవరి 26 నుండి ఫిబ్రవరి 10 వరకు అరకు లో మొదటి షెడ్యూల్, ఫిబ్రవరి 18 నుండి మార్చి 30 వరకు రెండవ షెడ్యూల్ చివరగా కులుమనాలి లో ఏప్రిల్ 2 నుండి ఏప్రిల్ 10 వ తేదీతో షూటింగ్ పూర్తి చేయనున్నట్లు నిర్మాత తెలియజేశారు అరవింద్ కృష్ణ, బిగ్ బాస్ ఫేమ్ ఆషురెడ్డి, స్నేహా గుప్త తదితరులు ముఖ్యపాత్రలు పోషించనున్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News