Sunday, December 22, 2024

జియాగూడలో మైనర్ బాలిక ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

గోషామహల్: చదువుతో పాటు ఆ ట పాటల్లో చురుగ్గా ఉంటూనే టిక్ టాక్‌టలో ఎంతో యాక్టివ్‌గా ఉండే ఇంటర్మీడియట్ విద్యనభ్యసిస్తున్న మైనర్ బాలిక అనుమానాస్పదంగా ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కుల్సుంపురా పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది , కాగా అమావాస్య నుండి మృతురాలి ఇంటి ఎదుట క్షుద్ర పూజలు నిర్వహించడం వల్లే బాలిక ఆత్మహత్యకు పాల్పడిందని, ముమ్మాటికీ ఇది క్షుద్ర పూజలతో చేసిన హత్యేనని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురి చేయడంతో పాటు తీవ్ర కలకలం రేపిన ఈ ఘటన పై కుల్సుంపురా పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన సంబంధిత వివరాలు, ఇన్‌స్పెక్టర్ అశోక్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం. మెదక్ జిల్లాకు చెందిన రమాదేవి, శ్రీనివాస్ దంపతులు గత కొన్నేళ్లుగా జియాగూడ భరత్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు.
శ్రీనివాస్ వృత్తి రీత్యా వ్రైడర్. వీరికి ముగ్గు రు కూతుళ్లు సంజన, నవ్య, దివ్యలు సంతానం. వీరిలో మొదటి కూతురు డిగ్రీ, రెండో కూతురు ఇంటర్మీడియట్, మూడో కూతురు పాఠశాల విద్యను అభ్యసిస్తున్నారు. కాగా అనుమానాస్పదంగా ఆత్మహత్యకు పాల్పడిన మృతురాలు నవ్య (17) బాగ్ లింగంపల్లిలోని అంబే ద్కర్ కాలేజీలో ఇంటర్మీడియ ట్ చదువుతుంది.

బుధవారం రాత్రి ఇంటి గ్రౌండ్ ఫ్లోర్‌లోని గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తె లిపారు. అయితే కుటుంబ సభ్యులు మాత్రం అమావాస్య నుండి తమ ఇంటి ఎదుట గుర్తుతెలియని వ్యక్తులు నిమ్మకాయలు, కొబ్బరికాయలు, అగరుబత్తీలు, పసుపు, కుంకుమ వేసి క్షుద్ర పూజలు చే శారని, అందువల్లే తమ కూతురు మరణించిందని ఆరోపిస్తున్నారు.
వివిధ కోణాల్లో పోలీసుల దర్యాప్తు
కుల్పుంపురా పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేపిన ఇంటర్మీడియట్ విద్యనభ్యసిస్తున్న మైనర్ బాలిక ఆత్మహత్య ఘటనపై పోలీసు లు దర్యాప్తును వేగవంతం చేశారు. మైనర్ బాలిక ఆత్మహత్యకు కారణాలపై వివిధ కోణాల్లో ద ర్యాప్తు చేస్తున్నారు. మైనర్ బాలిక క్షుద్ర పూజల వల్ల మరణించిందా? లేక ప్రేమ వ్య వహారం ఏమైనా ఉందా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News