Thursday, January 23, 2025

70 ఏళ్ల బామ్మ చేసిన సాహసం..తప్పిన రైలు ప్రమాదం

- Advertisement -
- Advertisement -

మంగళూరు : 70 ఏళ్ల బామ్మ తన సమయస్ఫూర్తితో ఓ రైలును పెను ప్రమాదం నుంచి తప్పించారు. రైలుకు అడ్డంగా పరిగెత్తుకుంటూ వెళ్లి మరీ వందల మంది ప్రాణాలను కాపాడారు. కర్ణాటకలో ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది. కర్ణాటక లోని మంగళూరుకు చెందిన చంద్రవతి అనే మహిళ స్థానికంగా రైల్వేట్రాక్ సమీపంలో నివాసం ఉంటున్నారు. మార్చి 21న మధ్యాహ్నం సమయంలో తన ఇంటి ముందు నిలబడి ఉండగా, ట్రాక్‌పై ఓ చెట్టు పడిపోవడాన్ని గుర్తించారు. ఆ సమయంలో రోజూ ఆ పట్టాలపై మంగళూరు నుంచి ముంబైకి వెళ్లే మత్సగంధ ఎక్స్‌ప్రెస వస్తుందని ఆమెకు తెలుసు.

దీంతో వెంటనే అప్రమత్తమైన చంద్రవతి ….రైలు శబ్దాన్ని విని ఇంట్లోకి పరుగుపెట్టి ఎర్రటి వస్త్రాన్ని తీసుకొచ్చారు. పరుగెత్తుకుంటా రైలుగు ఎదురుగా వెళ్లి ఆ వస్త్రాన్ని ఊపి రైలు ఆపమని సైగ చేశారు. ప్రయాదాన్ని ఊహించిన ఆ రైలు లోకోపైలట్ వేగాన్ని నెమ్మది చేశారు. దీంతో సరిగ్గా చెట్టు పడిపోయిన ప్రాంతం వద్ద రైలు ఆగడంతో పెను ప్రమాదం తప్పింది. అనంతరం రైల్వే అధికారులు, స్థానికులు ట్రాక్ వద్దకు చేరుకుని ఆ చెట్టును తొలగించారు. అతితక్కువ సమయంలో ఆమె సమయస్ఫూర్తితో వ్యవహరించి వందల మంది ప్రాణాలను కాపాడారని ఆమెను ప్రశంసించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News