Monday, January 20, 2025

మోడీ పోస్టర్ల కలకలం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ పర్యటన వేళ నగరంలో పోస్టర్ల కలకలం కొనసాగుతున్నది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పుట్టుకను పదేపదే అవమానించిన మోడీకి ఇక్కడ పర్యటించే నైతిక హక్కు లేదంటూ పోస్టర్లు దర్శనమిచ్చాయి. సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. రాష్ట్రాన్ని గడబిడగా తోపులాటలు, అణిచివేతల మధ్య విభజించారని చర్చ జరగకుండా ఏర్పడిన తెలంగాణలో ప్రజలు సంతోషంగా లేరని ప్రధాని పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలను ఈ పోస్టర్లలో పేర్కొన్నారు.

నేడు (ఆదివారం) మహబూబ్ నగర్ జిల్లాలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ పర్యటన నేపథ్యంలో హైదరాబాద్‌లో ఏర్పాటైన పోస్టర్లు చర్చనీయాంశంగా మారాయి. ‘తెలంగాణ పుట్టుకను పదే పదే అవమానించిన ప్రధానికి తెలంగాణలో పర్యటించే నైతిక హక్కు లేదు’ అంటూ పోస్టర్లుల్లో లిఖించారు. ‘బిడ్డను బతికించడం కోసం తల్లిని చంపారంటూ’ తెలంగాణపై పార్లమెంట్ సాక్షిగా విషం చిమ్మిన మోడీ.. పార్లమెంట్ సాక్షిగా తెలంగాణపై మోడీ చేసిన అనుచిత వ్యాఖ్యలు, తేదీలతో సహా తెలుపుతూ పోస్టర్లు వెలిశాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News