Monday, December 23, 2024

ఇద్దరు పిల్లలతో సహా చెరువులో దూకి తల్లి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -
  • వారం క్రితమే భర్త ఆత్మహత్యాయత్నం
  • ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న భర్త

మెదక్ రూరల్: ఇద్దరు పిల్లలతో సహా తల్లి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మెదక్ జిల్లా కొంటూరు గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. బంధువులు, పోలీసుల వివరాల ప్రకారం… మెదక్ మండలం వెంకటాపూర్‌కు చెందిన కొక్కు లక్ష్మి(28)కి ఏడు సంవత్సరాల క్రితం రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామానికి చెందిన ఎల్లంతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు శరణ్య(4), చిన్నారి (3) ఉన్నారు. కాగా వీరికి వివాహం అయిన నాటి నుంచి తరుచూ కుటుంబ కలహాలు జరగడంతో పలుమార్లు పెద్దలు సద్దిచెప్పినప్పటికీ గొడవలు తగ్గలేదు. ఈ తరుణంలో భర్త ఎల్లం గత వారం రోజుల క్రితం తన ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా ఆస్పత్రికి తరలించడంతో ప్రాణపాయస్థితిలో చికిత్స పొందుతున్నాడు. దీంతో తన భర్త ఎల్లం బతకడని భావించిన లక్ష్మి తన ఇద్దరు పిల్లలతో సహా స్వగ్రామమైన వెంకటాపూర్‌కు వెళ్తున్నానని చెప్పి కొంటూర్ చెరువులో తన ఇద్దరు పిల్లలతో దూకింది.

స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను మెదక్ ఏరియా ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నామని తల్ల్లీ పిల్లల ఆత్మహత్యల గల కారణాలపై పూర్తి విచారణ చేపట్టి త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని మెదక్ డిఎస్పి సైదులు, రూరల్ సిఐ విజయ్‌లు పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి హుటాహుటిన ఏరియా ఆస్పత్రికి చేరుకుని కుటుంబ సభ్యులను ఓదార్చి ఘటనకు సంబంధించిన కారణాలను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ ఘటనతో వెంకటాపూర్ గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News