- Advertisement -
హైదరాబాద్: ఎపి పురపాలక, పట్టణాభివఅద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. విశాఖ ఆర్కే బీచ్‌లో పారా గ్లైడింగ్ వెళ్లేందుకు మంత్రి సురేష్ యత్నించారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం విశాఖ ఆర్కే బీచ్‌లో పారా గ్లైడింగ్ చేస్తుండగా టేకాఫ్ సమయంలో విండ్ డైరెక్షన్ సహకరించకపోవడంతో ఇంజిన్ పక్కకు ఒరిగింది. అయితే మంత్రి వ్యక్తిగత సిబ్బంది అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది. దీంతో మంత్రి సురేశ్‌తోపాటు అక్కడే ఉన్న ఇతర మంత్రులు షాక్‌కుగురయ్యారు.
- Advertisement -