Thursday, December 19, 2024

ఎమ్మెల్యేలు బాబురావు, రోహిత్‌రెడ్డిలకు తృటిలో తప్పిన ప్రమాదం

- Advertisement -
- Advertisement -

బోథ్/తాండూరు: ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో మంత్రి ఇంద్ర కరణ్‌రెడ్డిని కలిసి ఆదిలాబాద్ జిల్లాకు వస్తున్న క్రమంలో నేరడిగొండ మండలం కొరటికల్ రోడ్డు మూల వద్ద ఆవును కారు ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు చేతికి తీవ్ర గాయాలయ్యాయి. కారులో ఉన్న ఎమ్మెల్యే ఇతరులను రిమ్స్ తరలించినట్లు సమాచారం. మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డికి ప్రమాదం తప్పింది. శనివారం కర్ణాటక రాష్ట్రం మంగళూరు సమీపంలో శృంగేరి శారదా పీఠం శ్రీ విధుశేఖర భారతి స్వామిజీని ఆహ్వానించేందుకు వెళుతున్న క్రమంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి క్రమంలో ప్రమాదం చోటుచేసుకుంది. అయితే ప్రమాదంలో తనకు ఎలాంటి గాయాలు కాలేదని రోహిత్‌రెడ్డి తెలిపారు. మీ అందకి ప్రేమానురాగాల వలన నేను క్షేమంగానే ఉన్నానని అన్నారు. నా అభిమానులు , కార్యకర్తలు, నాయకులు, నా శ్రేయోబిలాషులు ఎవరు కూడా ఆందోళన చెందవద్దని కోరుకుంటున్నాని ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News