Monday, December 23, 2024

టీచర్ల హాజరుకు కొత్త విధానం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్:  రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులకు ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్ ( హాజరు) విధానం అందుబాటులోకి రానుంది. మొదటి దశలో విద్యార్థులకు అమలు చేసి, రెండో దశలో టీచర్లకు అమలు చేయనున్నట్లు తెలిసింది. ఉపాద్యాయులకు ముఖ గుర్తింపు హాజరు అమలు పై పాఠశాల విద్యాశాఖ త్వరలోనే నిర్ణయం తీసు కోనున్నట్లు సమాచారం. ఇప్పటికే విద్యార్థులకు ముఖ గుర్తింపు హాజరు అమలు కోసం కృత్రిమ మేధ సాంకేతికతతో పనిచేసే డిఎస్‌సి ఎఫ్‌ఆర్‌సి పేరిట పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక యాప్‌ను రూ పొందించింది. ఉపాధ్యాయులు ప్లే స్టోర్ నుంచి ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని పాఠశాలల్లో వి ద్యార్థుల ముఖాలకు సంబంధించిన ఫేషియల్ పాయింట్లను ఒకసారి నమోదు చేయాలి. రిజిస్ట్రే షన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత యాప్‌లో కెమె రాను ఒపెన్ చేస్తే తరగతి గదిలో విద్యార్థులు కని పించేలా తిప్పితే ఎంతమంది విద్యార్థులు హాజరయ్యారో ఆన్‌లైన్‌లో నమోదవుతుంది. విద్యార్థుల హాజరు వివరాలను హెచ్‌ఎం, ఎంఇఒ సహా రాష్ట్రస్థాయి అధికారులు సైతం వెంటనే చూసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ కొత్త విధానాన్ని ప్రభుత్వ పాఠశాలలతో పాటు కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు(కెజిబివి)లు, మోడల్ స్కూళ్లు, పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గురుకులాల్లోనూ అమలు చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 26 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలల్లోని దాదాపు 28 లక్షల మంది విద్యార్థులకు ముఖ గుర్తింపు హాజరు విధానాన్ని అమలు చేయనున్నారు. ఈ విధానం అందుబాటులోకి వస్తే విద్యార్థుల అటెండెన్స్ వివరాలను హెచ్‌ఎం నుంచి ఉన్నతాధికారుల వరకు సులువుగా తెలుసుకోగలుగుతారు.
రెండో దశలో టీచర్లకు
మొదటి దశలో విద్యార్థులకు ముఖ గుర్తింపు హాజరు అమలు చేసిన తర్వాత ఉపాధ్యాయులకు కూడా ఇదే విధానాన్ని అమలు చేయనున్నారు. ఇప్పటికే దాదాపు 10 జిల్లాలకు పైగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులకు బయోమెట్రిక్ హాజరు విధానం అమలులో ఉన్నది. ఫేషియల్ రికగ్నషన్ అటెండెన్స్ అమలులో భాగంగా విద్యార్థుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఉపాధ్యాయులకు బయోమెట్రిక్ హాజరు స్థానంలో షేషియల్ రికగ్నషన్ అటెండెన్స్‌ను అమలు చేయనున్నారు. బయోమెట్రిక్ హాజరు, రిజిష్టర్‌లో సంతకం చేసే విధానం స్థానంలో ఈ కొత్త విధానం అమలులోకి రానున్నది. ఈ విధానం అమలులోకి వస్తే ఉపాధ్యాయులు వారు పనిచేస్తున్న పాఠశాల ప్రాంగణం నుంచే యాప్‌లో  ప్రతిరోజూ అటెండెన్సును నమోదు చేయాల్సి ఉంటుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News