Wednesday, January 22, 2025

వరుస వానలు.. జలపాతాలకు కొత్త కళ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణలోని పర్యాటక రంగంలో జలపాతాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. అద్బుతమైన జలపాతాలను పర్యాటకులు ఎటా లక్షల సంఖ్యలో చూసి కనువిందు చేసుకుంటున్నారు. తద్వరా ఒక్కో జలపాతం నుండి లక్షల రూపాయల ఆదాయాన్ని తెలంగాణ పర్యాటకాభివృద్ధి శాఖ పొందుతోంది. ముఖ్యంగా రామాయణ కాలపు నేపథ్యమున్న జలపాతాలు కూడా మన రాష్ట్రంలో ఉన్నాయి. ఇన్నాళ్లు నీళ్లు లేక ఊసూరుమన్న తెలంగాణ జలపాతాలు.. గత వారం రోజులుగా కురుస్తున్న వరుస వానలతో కొత్త కళను సంతరించుకుంటున్నాయి.

వేసవి ముగిసి వానాకాలం వచ్చినా వానలు లేక ఇప్పటి వరకు అవి వెలవెల పోయాయి. అటు ఎగువ ప్రాంతాల్లో కురస్తున్న భారీ వర్షాలకు తోడు.. గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని ప్రాజెక్టులు.. వివిధ జలపాతాలన్నీ జలకళతో కళకళలాడుతున్నాయి. అటు గోదావరి నదికి భారీ ఎత్తున వరద నీరు వస్తుండడంతో భద్రాచలం వద్ద నది నీటి మట్టం 43 అడుగుల దాకా చేరింది. మొత్తంగా ప్రాజెక్టులే కాదు.. పలు జలపాతాలన్నీ నీటి ప్రవాహంతో పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి.

వరుస వానల కారణంగా విద్యశాఖ ఆదివారం వరకు సెలవులు ఇవ్వడంతో ఈ వానలు కాస్త తెరపి ఇస్తే చాలు.. జలపాతాలకు వద్దకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో రానున్నట్లు పర్యాటకాభివృద్ధి శాఖ అంచనా వేస్తోంది. నిజానికి జలపాతాల ప్రాంతాలు అటవీ శాఖ పరిధిలోకి వస్తాయి. అయితే అక్కడికి వచ్చేది టూరిస్టులే కావడంతో పర్యాటకకాభివృద్ధి శాఖ ఈ దిశగా వారికి టాయిలెట్స్, బాత్‌రూమ్స్ లాంటివి ఏర్పాటు చేయడంతో పాటు పిల్లలను, పెద్ద వారిని ఆకర్షించేందుకు అలాగే ఇతర సకల సౌకర్యాలు కల్పించి తదనుగుణంగా ఆదాయాన్ని పొందుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News