Friday, January 10, 2025

హైదరాబాద్ కు సరికొత్త అందం

- Advertisement -
- Advertisement -

హుస్సేన్‌సాగర్ సమీపంలో మరో పర్యాటక అద్భుతం
పది ఎకరాల్లో అందమైన లేక్ ఫ్రంట్ పార్క్

త్వరలో పార్క్ ప్రారంభం.. అందమైన బోర్డ్ వాక్‌ను సందర్శించి, ఆనందించొచ్చు : మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ : సెంట్రల్ హైదరాబాద్‌కు సరికొత్త అందాన్ని జోడించనున్నట్లు రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ వెల్లడించారు ’ప్రసిద్ధ హుస్సేన్ సాగర్ సరస్సు చుట్టూ జల విహార్ పక్కన దాదాపు పది ఎకరాల్లో అందమైన లేక్ ఫ్రంట్ పార్క్ ను హెచ్‌ఎండిఎ అభివృద్ధి చేసింది. మరికొద్ది రోజుల్లో ఈ పార్కును ప్రారంభించనున్నాం. మీరందరూ అందమైన బోర్డ్ వాక్‌ను సందర్శించి ఆనందిస్తారని ఆశిస్తు న్నాను’ అంటూ మంత్రి కెటిఆర్ ట్వీట్ చేశారు. ఈ పార్క్ నిర్మాణాన్ని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండిఎ)ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. రూ. 15 కోట్లతో చేపట్టిన ఈ నిర్మాణంలో అండర్‌పాస్‌లు, స్కైవేలు, సీటింగ్‌తో కూడిన వాటర్ ఛానల్స్, లేక్ వంటి అద్భుత నిర్మాణాలు ఉన్నాయి. మధ్యలో చిన్న పిల్లలకు ఆటవిడుపు కోసం పార్క్ ను కూడా తీర్చిదిద్దారు.

హుస్సేన్ సాగర్‌పై విస్తరించి ఉన్న గ్లాస్ డెక్, లేక్ ఫ్రంట్ పార్క్ కోసం వేవ్ లాంటి కర్విలినియర్ డిజైన్‌లు ఏర్పాటు చేశారు. పార్కులో ఆకట్టుకునేలా ఏర్పాటు చేసిన లైటింగ్ అదనపు ఆకర్షణ. పార్కులో పిల్లల కోసం ఆటస్థలాలతో పాటు పెర్గోలాస్ ఏర్పాటు చేశారు. ముంబైకి చెందిన ల్యాండ్ స్కేప్ ఆర్కిటెక్ట్ కిషోర్ డి ప్రదాన్ ఈ పార్కు అభివృద్ధి, సుందరీకరణ పనులు చేపట్టారు. కాగా, ఈ లేక్‌ఫ్రంట్ పార్కు నిర్మాణం వల్ల 35 పక్షి జాతులకు భంగం వాటిల్లుతుందని పర్యా వరణవేత్తలు పిటిషన్ వేయగా గతంలో సుప్రీం కోర్టు ఈ పార్కు నిర్మాణంపై ఆంక్షలు విధించింది. జీవ వైవిధ్యానికి విఘాతం కలిగించే విధంగా హుస్సేన్ సాగర్ చుట్టూ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకూడదని సుప్రీంకోర్టు గతంలో హెచ్‌ఎండిఎను ఆదేశించింది. అయితే ఈ పార్కు నిర్మాణంతో జీవవైవిధ్యానికి ఎలాంటి నష్టం జరగబోదని, నష్టం జరగకుండా నిర్మాణం చేపడాతమని హెచ్‌ఎండీఏ కోర్టుకు వెల్లడించింది. ఇలా పలు మార్లు వాదనలు ముగిసిన తర్వాత ఎట్టకేలకు లేక్ ఫ్రంట్ నిర్మాణం పూర్తయింది. మరికొన్ని రోజుల్లో ప్రజలకు అందుబాటులోకి రానుంది.

Hussainsagar 1

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News