పంజాగుట్ట: మోకాలి నొప్పి కలిగినప్పుడు గుజ్జు అరుగుదల ఉన్న ప్రాంతాన్ని ఖచ్చితత్వంతో తెలుసుకునేందుకు ఈపియాన్ పెయిన్ రిలీఫ్ సెంటర్ అధునాతన సోనోసైట్ పరికరాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబరు 36లోని ఈపియాన్ క్లీనిక్లో సంస్థ డైరెక్టర్ డాక్టర్ దారా శనివారం ఈ పరికరాన్ని ఆవిష్కరించారు. అ నంతరం ఆయన మాట్లాడుతూ మోకాలి నొప్పి ప్రధాన కారణం గుజ్జు అరుగదలేనని చెప్పారు. అయితే ఎమ్రస్‌ఐ లాంటి పరీక్షల ద్వారా కూ డా గుజ్జు అరుగుదల ఎక్కడ ఉందనే విషయం తెలుసుకోవడం కష్టతరంగానే ఉంటుందన్నా రు.
దీన్ని వల్ల రోగి నొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు చాలా సమయం తీసుకుంటుందన్నారు. కాని సోనోసైట్ ద్వారా ఖచ్చితత్వం పెరుగుతుందని దీంతో చికిత్సలో మేలు జరుగుతుందని తెలిపా రు. మోకాలిలో గుజ్జు అరిగిన వారికి ఆపరేషన్ లేకుండా అత్యధిక పరిజ్ఞానం ద్వారా చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. నొప్పి ఉన్న రోగుల్లో రక్తకణాలను సేకరించి వాటిని గుజ్జు అరుగుదల ఉన్న ప్రాంతంలో ఇంజెక్ట్ చేస్తామని తద్వారా నొప్పి నుంచి పూర్తి ఉపశమనం పొందడంతో పాటు రోజు వారి పనులకు యదావిధిగా చేసుకోవచ్చన్నారు.
ఇప్పటి వరకు 15000 మందిని ఈ చికిత్సను తీసుకొని శస్త్ర చికిత్సను వరకు వెళ్లలేదని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో జూబ్లీహిల్స్, తమిళనాడు చెన్నైలో తమ క్లీనిక్‌ల ద్వారా రోగులకు సేవలందిస్తున్నట్లు చెప్పారు. మరో మూడు నెలల్లో బెంగళూరు, దుబాయ్ బ్రాంచిలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. గత ఇబ్బందులు పడుతున్న వారికి ఈ పరికరంతో ఎంతో ఉపయోగం కలుగుతుందన్నారు.