Wednesday, January 22, 2025

అసెంబ్లీకి కొత్త శోభ

- Advertisement -
- Advertisement -

నేటి నుంచి సమావేశాలు ప్రారంభం

ప్రమాణస్వీకారం నూతనంగా ఎన్నికైన శాసనసభ్యులు
ప్రొటెం స్పీకర్‌గా సీనియర్ సభ్యుడు, ఎంఐఎం ఎంఎల్‌ఎ అక్బరుద్దీన్ నియామకం
శాసనసభలో ఏర్పాట్లను పరిశీలించిన సిఎస్ శాంతికుమారి

మన తెలంగాణ/ హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రా రంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో శాసనసభ ప్రొటెమ్ స్పీకర్‌గా ఎంఐఎం ఎంఎల్‌ఎ అక్బరుద్దీన్ ఒవైసిని సిఎం రేవంత్ రెడ్డి నియమించారు. ప్రభు త్వ అభ్యర్థనను అంగీకరించిన అక్బరుద్దీన్ ఒవైసి నేడు ఎంఎల్‌ఎలతో అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. సభలో సీనియర్లుగా ఉన్న ఎం ఎల్‌ఎలలో ఒకరిని ప్రొటెమ్ స్పీకర్‌గా ఎంపిక చే యడం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం ఎన్నికైన సభ్యుల్లో మాజీ సిఎం కెసిఆర్ సభలో అందరి కంటే సీనియర్, కాగా, ఆయన ఆసుపత్రిలో చికి త్స పొందుతుండడంతో అక్బరుద్దీన్‌ను ప్రొటెమ్ స్పీకర్‌గా సిఎం రేవంత్ ఎంపిక చేసినట్టుగా తెలిసింది. నేడు ఉదయం 8.30 గంటలకు ప్రొటెమ్ స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఒవైసి రాజ్ భవన్‌లో ప్రమా ణ స్వీకారం చేస్తారు. రాజ్‌భవన్‌లో అక్బరుద్దీన్ చే త గవర్నర్ తమిళిసై ప్రమాణం చేయించనున్నా రు. కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రొటెం స్పీకర్ అ సెంబ్లీలో మొదటగా ప్రమాణస్వీకారం చేయించి స్పీకర్‌ను ఎన్నుకునేంత వరకు ప్రొటెం స్పీకర్ బా ధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. అక్బరుద్దీన్ ఒ వైసి ఆరుసార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. అ యితే ఈ అసెంబ్లీ సమావేశాలు నాలుగు రోజుల పాటు జరిగే అవకాశం ఉందని అధికారులు పే ర్కొంటున్నారు. ప్రస్తుతం అత్యధికంగా ఎనిమిది సార్లు ఎన్నికైన శాసన సభ్యుడిగా మాజీ సిఎం కెసిఆర్ ఉన్నారు. కెసిఆర్ తరువాత మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, దానం నాగేందర్ ఎంఐఎం నుంచి అక్బరుద్దీన్ ఒవైసి కూడా ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వీరితో పాటు కాంగ్రెస్‌లో ఆరుసార్లు ఎన్నికైన ఎంఎల్‌ఎలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావులు ఉన్నారు. కాంగ్రెస్ నేతలు ఇద్దరు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయడంతో సిఎం రేవంత్ రెడ్డి అక్బరుద్దీన్ ఒవైసి వైపు మొగ్గుచూపారు.
ఏర్పాట్లను పరిశీలించిన సిఎస్
నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన సిఎస్ శాంతి కుమారి, డిజిపి రవిగుప్తా, అసెంబ్లీ సెక్రటరీ, సమాచార. శాఖ కమిషనర్ అశోక్ రెడ్టి తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా భద్రతతో పాటు ట్రాఫిక్ తదితర అంశాలపై సిఎస్ అధికారులతో చర్చించారు.
ఎంఎల్‌సి కసిరెడ్డి రాజీనామాకు ఆమోదం
మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల కోట ఎంఎల్‌సి కసిరెడ్డి నారాయణ రెడ్డి తన ఎంఎల్‌సి పదవికి రాజీనామా చేశారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి శుక్రవారం కసిరెడ్డి రాజీనామాకు ఆమోదం తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News