Thursday, January 23, 2025

బిఆర్‌ఎస్ హయాంలో పట్టణాలకు సరికొత్తరూపు

- Advertisement -
- Advertisement -

జమ్మికుంట : బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో పల్లెలు, పట్టణాలు సరికొత్తరూపు సంతరించుకున్నాయని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమం త్రి కేసీఆర్ నాయకత్వంలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రణాళికతో రూపకల్పన చేశారన్నారు. పర్యావరణ పరిరక్షణ, కాలుష్యనియంత్రణ, పారిశుధ్యం, స్వచ్ఛతలో పారదర్శకత, ప్రజలకు అవసరమైన మౌళిక సదుపాయల కల్పన లక్షంగా తెలంగాణ ప్రభుత్వం పట్టణ ప్రగతి కార్యక్రమం రూపకల్పనతో మున్సిపాలిటీలను ప్రగతిపథంలో ముందుకు నడిపిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందన్నారు.

ముఖ్యమంత్రి కెసిఆర్ దార్శనికత, మున్సిపల్, ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి కెటిఆర్ కృషితో తెలంగాణ రాష్ట్రంలోని పట్టణాలు సరికొత్త రూపు సంతరించుకున్నాయని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో నేడు రాష్ట్రం యావత్తు దేశా నికే ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. అనంతరం ప్రభుత్వ విప్ కౌశిక్‌రెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ మున్సిపల్ సిబ్బందికి ప్రశంస పత్రాలను, దుస్తులు పంపిణీ చేశారు

. అంతకు ముందు పట్టణంలోని గాంధీ చౌరస్తాలో గాంధీ విగ్రహానికి, అంబేడ్కర్, తెలంగాణ తల్లి చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి, జాతీయా జెండా ఆవిష్కరించారు. భారీ ర్యాలీగా పాత మున్సిపల్ కార్యాలయంకు చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ ఆర్‌డిఓ హరిసింగ్, మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వ ర్‌రావు, తహసీల్దార్ బండి రాజేశ్వరి, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దేశని స్వప్నకోటి, కమీషనర్ కె.శ్రీనివాస్, కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బం దితో పాటు అనుబంద శాఖల సిబ్బంది, బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News