Thursday, December 26, 2024

ఉగ్రవాదానికి అంతిమదశ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ స్థానిక లోక్ కళ్యాణ్ మార్గ్ నివాసం సరికొత్త దీపజ్యోతిని సంతరించుకుంది. తన ఇంటికి సరికొత్త కళగా ఆవు దూడ కుటుంబ సభ్యురాలిగా వచ్చిందని, ఈ దూడకు దీపజ్యోతి అని పేరు పెట్టినట్లు మోడీ శనివారం ఎక్స్ సామాజిక మాధ్యమంలో తెలిపారు. తమ నివాసంలోని తల్లి ఆవు పండంటి దూడకు జన్మనిచ్చింది. మా కుటుంబంలో అరుదెంచిన ఆడబిడ్డగా భావించాను, పైగా ముద్దులొలికే ఈ దూడ నుదుటిన జ్యోతి గుర్తు ఉంది. అందుకే ఈ దూడకు దీపజ్యోతి పేరు పెట్టినట్లు మోడీ సందేశం వెలువరించారు. పుట్టిన దూడ ఓ బిడ్డగా ఇంటిలోపలికి రావడం, కలియతిరగడం, మోడీ ఈ దూడను ఎత్తుకుని ఉండటం వంటి లాలించడం వంటి దృశ్యాలు ఈ వీడియోలో వెల్లువెత్తాయి. దూడతో కలిసి ఇంటి ఆవరణలోని తోటలో కూడా మోడీ కలియతిరిగారు. మన వేదాలలో గోవు సర్వసుఖ ప్రదాత అనే నానుడి ఉంది. ఇది తనకే కాదు అందరికీ స్ఫూర్తిదాయకమే అవుతుందని మోడీ తమ సందేశంలో పేర్కొన్నారు. మా ఇంటికి మరో సభ్యురాలు వచ్చింది. ఇంతకు మించిన ఆనందం ఏముందని స్పందించారు. దీపజ్యోతి మెడలో పూలమాల వేయడం, లాలించడం, ఈ చిన్నారి కూడా మోడీని వీడకుండా తిరగడం ఆసక్తికరం అయింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News