నాంపల్లి : పెన్షనేర్ల ఆర్థిక ప్రయోజనాల కోసం వెంటనే నూ తన పీఆర్సీని నియమించేందుకు ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకోవాలని తెలంగాణ రిటైర్డ్ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు ఎం. మోహన్ నారాయణ కోరారు. బకాయిపడిన రెండు డీఏలను యుద్దప్రాతిపతికన విడుదల చేయాలన్నారు. ఈమేరకు బుధవారం తెలంగాణ రిటైర్డ్ గెజిటెడ్ అధికారుల సంఘం కార్యవర్గ సమావేశం జరిగింది. మోహన్ నారాయణ మాట్లాడుతూ పె న్షనేర్లకు ఆరోగ్య పథకాన్ని అమలు చేసి.. అన్ని కార్పొరేట్ ఆస్పత్రుల్లో నగదు రహిత వైద్య సేవలందించేందుకు ఆరోగ్య ట్రస్టీ ద్వారా చెల్లింపులు చేయాలన్నా రు.
కమ్యూనిటేషన్ ఆఫ్ పెన్షన్‌ను చెల్లింపు 15 ఏళ్ల నుంచి 12 సంవత్సరాలకు కుదిస్తూ ఈ దిశగా ప్రభుత్వం ప్రకటన చేయాలని కోరారు. ప్రతి నెలా తొలి రోజుల్లోనే పెన్షన్‌ను చెల్లించాలి, రాష్ట్ర సర్కార్ పెన్షనేర్లకు ఆదాయపు ప న్ను పరిధి నుంచి మినాయింపు ఇవ్వాలి, పెన్షనేర్ల సమస్యల పరిష్కార దిశగా ప్రత్యేక డైరెక్టరేట్‌ను నెలకొల్పాలని ఆయన కోరారు. తెలంగాణ ప్రజా ఉద్యమంలో పాల్గొన్న పెన్షనేర్లకు ప్రత్యేక ఇంక్రిమెంట్ మంజూరు చేయాలన్నారు.
సమావేశంలో తెలంగాణ రిటైర్డ్ గెజిటెడ్ అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి ఎస్. నర్సరాజు, నాయకులు జె.రవీందర్, కె. యాదయ్యగౌడ్,మహేశ్ బాబు, కుర్మారావు, ఎస్. వెంకయ్య, శివరాజ్, కృష్ణమూర్తి, సుజాత, ఆర్. లక్ష్మయ్య, కృష్ణమూర్తి, కోలామోహన్, బాబురావు, పెంటయ్య, రామనాధం, ఎస్.ఆంజనేయులు పాల్గొన్నారు.