Friday, December 20, 2024

భూగోళానికి పొంచి ఉన్న కొత్త ముప్పు!

- Advertisement -
- Advertisement -
ఇది విలుప్త స్థాయి(ఎక్స్ టింక్షన్  లెవల్) ఘటనకు కారణం కావచ్చు!!
నక్షత్రాలు పేలిపోయినప్పుడు ఏర్పడే ‘బ్లాస్ట్ వేవ్’ ముప్పును గుర్తించారు. నక్షత్రాలు పేలిపోవడం వల్ల పెద్ద ఎత్తున ఎక్స్‌రే కిరణాలు భూగ్రహం వంటి గ్రహాలకు చేరుతాయి.

ఇల్లినాయిస్: ఖగోళ శాస్త్రజ్ఞులు ఇప్పుడు భూ గ్రహానికి పొంచి ఉన్న కొత్త ముప్పును గుర్తించారు. అది సుదూర అంతరిక్షం నుంచి రానున్నది. అది మన నియంత్రణలో కూడా ఉండదు. చంద్ర ఎక్స్‌రే ఆబ్జర్వేటరీ, ఇత టెలిస్కోప్‌లను ఉపయోగించే ఖగోళ శాస్త్రవేత్తలు పేలిన నక్షత్రాల నుంచి ఉత్పన్నమయ్యే ఎక్స్‌రే కిరణాలు భూమి సహా 100 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న గ్రహాలను కూడా ప్రభావితం చేసే దశ రావచ్చని గుర్తించారు. పేలిన నక్షత్రాలు మునుపటి కంటే గ్రహాలకు ఎక్కువ ప్రమాదాన్ని కలిగిస్తాయని కొత్త అధ్యయనంలో తేలింది.

‘ఒకవేళ టోరెంట్ ఎక్స్‌రే కిరణాలు సమీప గ్రహంపైకి ప్రసరిస్తే, దాని రేడియషన్ గ్రహ వాతావరణం కెమిస్ట్రీని ప్రభావితం చేయగలదు. భూ గ్రహం వంటి విషయానికి వస్తే, ఓజోన్ పొరలో గణనీయమైన భాగాన్ని తుడిచిపెట్టేయగలదు. ఓజోన్ పొరయే అతి నీలలోహిత కిరణాల నుంచి మన జీవితాలను రక్షిస్తోంది’ అని ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయంకు చెందిన ఇయాన్ బ్రంటన్ ఓ ప్రకటనలో తెలిపారు.

ఖగోళ శాస్త్రవేత్తలు సుదూర అంతరిక్షంలో 31 సూపర్‌నోవాలు, వాటి అనంతర పరిణామాలను గమనించారు. గ్రహాలు 160 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న రేడియేషన్‌కు గురికావొచ్చని ఆ శాస్త్రవేత్తలు అన్నారు. ఈ అధ్యయన బృందం టెలిస్కోప్ ద్వారా సూపర్‌నోవా 1979సి, ఎస్‌ఎన్ 1987ఎ, ఎస్‌ఎన్ 2010జెఎల్, ఎస్‌ఎన్ 19941ని లక్షంగా చేసుకున్నాయి.
‘ప్రస్తుతానికైతే భూమికి ఎటువంటి ప్రమాదం లేదు. ఎందుకంటే ఎక్స్‌రే ప్రమాద జోన్‌లో సంభావ్య సూపర్‌నోవాలు లేవు. అయితే ఇటువంటి ఘటనలు భూగ్రహ గతంలో పాత్ర పోషించి ఉండొచ్చు’ అని సహరచయిత ఓ మహోని తెలిపారు. రెండు నుంచి ఎనిమిది మిలియన్ సంవత్సరాలకు పూర్వం భూమికి దగ్గరలో సూపర్నోవాలు సంభవించి ఉండొచ్చని గత పరిశోధనలు నిర్ధారించాయి. ఇవి భూమికి 65 నుంచి 500 కాంతి సంవత్సరాల దూరంలో ఉండి ఉండవచ్చు.

‘సూపర్నోవా నుండి వెలువడే ఎక్స్‌రే కిరణాలపై తదుపరి పరిశోధన నక్షత్రాల జీవిత చక్రాన్ని అర్థం చేసుకోడానికి ఉపయోగపడగలదు. అయితే ఆస్ట్రోబయాలజీ, పాలియోంటాలజీ, భూమి, గ్రహశాస్త్రాల వంటి వాటిపై ప్రభావం చూపగలదు’ అని ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయానికి చెందిన సహ రచయిత బ్రియాన్ ఫీల్డ్ తెలిపారు.

Supernova radiation2

Threat-to-earth-3

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News