Monday, December 23, 2024

క్యాన్సర్ చికిత్స చరిత్రలో ఒక సరికొత్త ఒరవడి

- Advertisement -
- Advertisement -

మాదాపూర్: క్యాన్సర్ చికిత్స చరిత్రలో ఒక సరికొత్త ఒరవడి మొదలైందని యశోద గ్రూప్ హస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జి.యస్ రావు అన్నారు. మంగళవారం మాదాపూర్ యశోద హస్పిటల్‌లో భారతదేశంలోనే మొట్ట మొదటి సారిగా నూతనంగా ఏర్పాటు చేసిన ఎంఆర్ లినాక్ రేడియేషన్ టెక్నాలజీని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతు క్యాన్సర్ చికిత్సకు సరికొత్త ఒరవడి మొదలైందన్నారు. మాదాపూర్ యశోదలో రేడియేషన్ ఆంకాలజీ విభాగంలో భారతదేశంలోనే మొట్టమొదటి ఎంఆర్ లినాక్ రేడియేషన్ టెక్నాలజీ ఆవిష్కరించబడిందన్నారు. ఎంఆర్‌ఐ మరియు రేడియేషన్‌తో క్యాన్సర్ చికిత్సలలో విప్లవాత్మక మార్పులు చేయగల లినాక్ ఎంఆర్ యంత్రాన్ని దేశంలోనే తొలిసారిగా యశోద గ్రూప్ హస్పిటల్స్‌లో నెలకొల్పడం జరిగిందన్నారు.

దీంతో క్యాన్సర్ చికిత్స సమయంలో క్రిస్టల్ క్లియర్ ఇమేజింగ్ పొందడానికి ఈ అత్యాదునిక సాంకేతికత సహయం చేస్తుందన్నారు. రియల్ టైమ్ అడాప్టివ్ రేడియోథెరఫి, రియల్ టైమ్ ట్యూమర్ మానిటరింగ్ సామర్థాలతో పాటు స్పష్టంగా చూడగల సామర్థం ఈ సాంకేతికత సోంత లీనియర్ యాక్సిలరేటర్‌పై ఎంఆర్‌ఐ ఆధారిత ఇమేజింగ్ ఉన్నతమై హై డెఫినిషన్ ఇమేజ్ క్వాలిటిని అందిస్తుంది. ప్రత్యేకించి కొన్ని మృదు కణజాల క్యాన్సర్‌ల కోసం సాంప్రదాయ లీనియర్ యాక్సిలరేటర్‌లతో పోలిస్తే ఇదిట్రీట్‌మెంట్ సెటప్, డెలివరీ కోసం టార్గెట్ ప్రాంతం మరియు ప్రక్కనే ఉన్న అనాటమీని దృశ్యమానం చేయడానికి ఎక్స్‌రే ఆధారిత ఇమేజింగ్‌ను ఇంతకు ముందు సాధ్యం కాని స్థాయిలో అనుమతిస్తుంది. కష్టతరమైన క్యాన్సర్‌లతో సహ అన్ని రకాల క్యాన్సర్ చికిత్సకు ఈ లినాక్ ఎంఆర్ ప్రభావ వంతంగా పని చేస్తుందన్నారు. భారతదేశంలో అత్యంత సాధారణ క్యాన్సర్లలో రోమ్ము ఊపిరితిత్తులు, నోటి మరియు గర్భాశయ క్యాన్సర్లు ఉన్నట్లు అంచనా వేసారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) అంచనాల ప్రకారం 2020 నుండి 2025 వరకు క్యాన్సర్ వ్యాధి 12.8 శాతం వరకు పెరగొచ్చని అంచనా వేసారు. తద్వారా ప్రతి తొమ్మిది మంది భారతీయులలో ఒకరికి జీవితకాలంలో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని అంచన అన్నారు.

ఎంఆర్ లినాక్ సాంకేతికతతో వైద్యులు పేషెంట్ అంతర్గత శరీర నిర్మాణ శాస్త్రం, క్యాన్సర్ కణితిని దృశ్యమానం చేయడానికి వీలవుతుందన్నారు. ఎంఆర్‌ఐ యొక్క శక్తిని ఉపయోగించడం ద్వారా ఈ సాంకేతికత అత్యంత ఖచ్చితమైన అనుకూలమైన రేడియేషన్ థెరపీని అందిస్తుందన్నారు. ఆరోగ్యకరమైన చుట్టు ప్రక్కల కణజాలాలనను కాపాడుతూ అసమానమైన కణితులను ఖచ్చితత్వంతో లక్షంగా చేసుకుంటుందన్నారు. టాటా మెమోరియల్ హస్పిటల్ ముంబై డైరెక్టర్, ప్రోఫెసర్, థోరాసిక్ సర్జరీ విభాగం అధిపతి డాక్టర్ సిఎస్ ప్రమేష్ మాట్లాడుతు 40 సంవత్సరాల కంటే ఎక్కవ వయస్సు ఉన్న పురుషులలో ఊపిరితిత్తుల క్యాన్సర్ అత్యంత సాధారణ క్యాన్సర్‌గా ఉందన్నారు.

స్త్రీలలో అయితే రొమ్ము క్యాన్సర్ అన్ని వయసుల స్త్రీలలో అగ్రస్థానంలో ఉందన్నారు. ఈ ఎంఆర్ లినాక్‌తో క్యాన్సర్‌ల చికిత్సకు అత్యంత అత్యాధునిక రేడియేషన్ థెరపీఇ అందించవచన్నారు. ప్రత్యేకించి కొన్న మృదు కణజాల కణితులకు లీనియర్ యాక్సిలరేటర్‌పై ఎంఆర్‌ఐ ఆధారిత ఇమేజింగ్, హై డెఫినిషన్ ఇమేజ్‌లను అందిస్తుందన్నారు. అడాప్టివ్ ట్రీట్‌మెంట్ ప్లానింగ్, ఎంఆర్ లినాక్ యొక్క ఇమేజింగ్ సామర్థాలు కణిత ప్రతి స్పందన, అనాటమీలో మార్పులపై విలువైన సమాయాచారాన్ని అందిస్తాయన్నారు. ఇది అడాప్టివ్ ట్రీట్ మెంట్ ప్లానింగ్ కోసం వైద్యులు చికిత్స సమయంలో అంతరాయాలు లేకుండా చిక్సితను సవరించవచ్చున్నారు. లక్ష్యాన్ని నిర్థారించడానికి, ఆరోగ్యకరమైన కణజాలాలకు నష్టాన్ని తగ్గించడానికి ఎంఆర్ లినాక్ సాంకేతికత క్యాన్సర్ చికిత్సలో ఎంతో ప్రభావవంతగా పని చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎలెక్టా మేనేజింగ్ డైరెక్టర్ ఇండియా , సినియర్ వైస్ ప్రెసిడెంట్ మణికందన్ బాలా తదితరులు పాల్గోన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News