Thursday, November 14, 2024

విజయ బ్రాండ్ వంట నూనెల ప్యాకింగ్‌కు కొత్త యూనిట్

- Advertisement -
- Advertisement -

అగ్రివర్శిటీ భూముల్లో 3.8 ఎకరాలు కేటాయింపు
హైదరాబాద్ :  రాష్ట్ర ప్రభుత్వం విజయ బ్రాండ్ ఉత్పత్తులను ప్రజలకు మరింత చేరువ చేసే దిశగా చర్యలు చేపట్టింది. తెలంగాణ రాష్ట్ర నూనె గింజల ఉత్పత్తిదారుల సహకార సమాఖ్య లిమిటెడ్ (రాష్ట్ర ఆయిల్ ఫెడ్ సంస్థ)కు చెందిన విజయ హైదరాబాద్ వంటనూనెల మెగా ఆయిల్ ప్యాకింగ్ స్టేషన్ కర్మాగారం నిర్మాణానికి గురవారం నాడు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి శంకుస్థాపన చేశారు.రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… నాణ్యత ప్రమాణాలతో కూడిన విజయ హైదరాబాద్ వంటనూనెలు ప్రజలకు మరింత చేరువ చేయాలని ప్రస్తుతం ఉన్న ప్యాకింగ్ కేంద్రం శివరాంపల్లిలో మూడు షిఫ్ట్ లలో నడుస్తుఉన్నందున ప్రజల నుండి వస్తున్న డిమాండ్ మేరకు వ్యవసాయ విశ్వవిద్యాలయం కు సంబందంచిన 3.8ఎకరాల భూమిని ఆయిల్ ఫెడ్ సంస్థకు కేటాయించామని తెలిపారు.

రాబోయే రోజుల్లో మంచి అధునాతన యంత్రాలతో పూర్తి మైగ్రేడ్ పద్ధతిలో ప్యాకింగ్ స్టేషన్ ను నిర్మించి ప్రజలకు మంచి నాణ్యమైన వంట నూనెలను ప్రజలకు అందించాలని ఆశిస్తున్నట్టు తెలిపారు.అలాగే రాష్ట్ర ఆయిల్ ఫెడ్ సంస్థ ఆయిల్ పామ్ సాగులో కూడా 8 జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం కు పనిచేస్తూ ప్రభుత్వ రంగ సంస్థలకు ఒక రోల్ మోడల్ గా నిలుస్తుందన్నారు. ప్రస్తుత సీజన్లో కూడా కిందటి సంవత్సరంలో లాగా పనిచేసి రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని ఆశిస్తున్నట్టు మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు.

చైర్మన్ కంచల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఆయిల్ ఫెడ్ సంస్థకు 3.8 ఎకరాల స్థలాన్ని కేటాయించడంలో ప్రత్యేక చొరవ తీసుకొని స్థలాన్ని కేటాయించినందుకు మంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. తాను ఈ సంస్థకు చైర్మన్ గా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి మంచి నాణ్యత ప్రమాణాలతో వంట నూనెలను ఉత్పత్తి చేయటం జరుగుతుందన్నారు. విజయ హైదరాబాద్ వంటనూనెలను సంవత్సరానికి దాదాపు 36 వేల టన్నుల ఆయిల్ అమ్మకాలు జరుగుతున్నాయని వెల్లడించారు.అలాగే ఆయిల్ ఫెడ్ కు కేటాయించిన 3.8 ఎకరాల్లో రూ. 25 కోట్ల రూపాయలతో అత్యంత అధినాతనమైన విజయ హైదరాబాద్ మెగా ప్యాకింగ్ కేంద్రం , కినర త్రాగునీటి కర్మాగారాలను జనవరి 2024 లోపు పూర్తి చేసి వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువస్తామని ప్రకటించారు..సంస్థకు కేటాయించిన 8 జిల్లాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం మేరకు ఆయిల్ పామ్ సాగు చేయాలని లక్ష్యంతో ముందుకు వెళుతున్నామని రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఆయిల్ ఫెడ్ ఎండి డైరెక్టర్ సురేందర్,యూనివర్సిటీ రిజిస్టర్ వెంకటరమణ,జనరల్ మేనేజర్ సుధాకర్ రెడ్డి,మేనేజర్లు తిరుమలేష్ రెడ్డి,జన్ను సత్యనారాయణ,శ్రీకాంత్ రెడ్డి, శివరాం పల్లి ప్యాకింగ్ స్టేషన్ మేనేజర్ వెంకటేశ్వర్ రెడ్డి,సంస్థ ఉద్యోగులు,కార్మికులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News