Sunday, December 22, 2024

నాన్ బెయిలబుల్ వారెంట్ ఎగ్జిక్యూట్ చేయాలి

- Advertisement -
- Advertisement -
  • సిపి శ్వేత

సిద్దిపేట: ఫోక్సో, ఎస్సి, ఎప్టి కేసుల్లో 60 రోజులలో ఇన్వెస్టిగేషన్ పూర్తిచేసి చార్జీపీట్ దాఖలు చేయాలని సిపి శ్వేత అన్నారు. గురు వారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సిద్దిపేట వన్ టౌన్, టుటౌన్, త్రీటౌన్ పోలీస్ అధికారులతో పెండింగ్ కేసులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సైబర్ నేరాలు, మహిళా రక్షణకు ఉన్న చట్టాల గురించి అహగాహన కల్పించాలన్నారు. కేసులలో నేరస్థుల పూర్తి వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరచాలన్నారు. రౌడీ,కేడి, డిసి , సస్పెక్ట్ ల, సంఘ విద్రోహశక్తుల వివరాలను టిఎస్‌కాప్‌లో పొందుపరిచి ప్రతిరోజు వారి కదలికలపై నిఘా పెట్టాలన్నారు. విలేజ్ పోలీస్ ఆఫీసర్ విపిఓ వ్యవస్థను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలన్నారు. 2021-/22 సంవత్సరంలో పెండింగ్ ఉన్న గ్రేవ్ కేసుల్లో త్వరగా పరిశోధన చేసి చార్జిషీట్ దాఖలు చేయాలని అండర్ ఇన్వెస్టిగేషన్‌లో ఉన్న కేసుల్లో అన్ని కోణాల్లో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి కోర్టులో చార్జీషిట్ దాఖలు చేయాలన్నారు.

దొంగతనాల కేసుల్లో ప్రతి రోజు కేసుల ఛేతన గురించి అన్ని కోణాల్లో ప్లాన్ ఆప్ యాక్షన్ ఎస్‌ఓపి ప్రకారం,ఇన్వెస్టిగేషన్ చేసి కేసులు ఛేదించాలన్నారు. సిసి కెమెరాలను ప్రతి రోజు మానిటర్ చేయాలని పని చేయ్యని సిసి కెమెరాలను వెంటనే బాగు చేయించాలని సూచించారు. సిసిటిఎన్‌ఎస్‌లో 7 ఇంటి గ్రేటెడ్ ఫార్మ అన్ని పూర్తి చేయాలని సూచించారు. రాత్రి పెట్రోలింగ్ అధికారులు లాడ్జిలు , పాత నేరస్థులను తనిఖీ చేయాలని తెలిపారు. వర్టికలత్ వారిగా ఎంట్రీ చేసిన డాటాను నోడల్ అధికారులు ప్రతిరోజు తనిఖీ చేసుకోవాలని, క్వాలిటీ డాటా ఎంట్రీ చేయాలని సూచించారు. విధి నిర్వహణలో రోల్ క్లారిటీ, గోల్ క్లారీటి ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు డిసిపి మహేందర్, ఎసిపిలు దేవారెడ్డి, రమేశ్, ఫణిందర్, చంద్రశేఖర్, రవీందర్‌రాజు, సిఐలు బిక్షపతి, రవికుమార్, భానుప్రకాశ్ దుర్గ, గురుస్వామి, రఘుపతిరెడ్డి, సిద్దిపేట డివిజన్ ఎస్‌ఐలు, ఐటికోర్ టీం సిబ్బంది, సిసిఆర్బి సిబ్బంది తదిరతులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News