Wednesday, November 6, 2024

నాన్ బెలబుల్ వారెంట్ ఎగ్జిక్యూట్ చేయాలి

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట క్రైమ్: నాన్ బెలబుల్ వారెంట్ ఎగ్జిక్యూట్ చేయాలని సిపి శ్వేత అన్నారు. శుక్ర వారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో హుస్నాబాద్ డివిజన్ పోలీస్ అధికారులతో పెండింగ్ కేసులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసులలో నేరస్థుల పూర్తి వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరచాలన్నారు. రౌడి,కేడి, డిసి , సస్పెక్ట్ ల, సంఘ విద్రోహశక్తుల వివరాలను టీఎస్‌కాప్‌లో పొందుపరిచి ప్రతిరోజు వారి కదలికలపై నిఘా పెట్టాలన్నారు. విలేజ్ పోలీస్ ఆఫీసర్ విపిఓ వ్యవస్థను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలన్నారు. 2020,-21 సంవత్సరంలో పెండింగ్ ఉన్న గ్రేవ్ కేసులలో త్వరగా పరిశోదన చేసి చార్జి షీట్ దాఖలు చేయాలని అండర్ ఇన్వెస్టగేషన్‌లో ఉన్న కేసులలో అన్ని కోణాల్లో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి కోర్టులో చార్జీషిట్ దాఖలు చేయాలన్నారు.

దొంగతనాల కేసుల్లో ప్రతి రోజు కేసుల చేతన గురించి అన్ని కోణాల్లో ప్లాన్ ఆప్ యాక్షన్ ఎస్‌ఓపి ప్రకారం,ఇన్వెస్టిగేషన్ చేసి కేసులు చేదించాలన్నారు.సిసి కెమెరాలను ప్రతి రోజు మానిటర్ చేయాలని పని చేయ్యని సిసి కెమెరాలను వెంటనే బాగు చేయించాలని సూచించారు. సీసీటీఎన్‌ఎస్‌లో 7 ఇంటి గ్రేటెడ్ ఫార్మ అన్ని పూర్తి చేయాలని సూచించారు. రాత్రి పెట్రోలింగ్ అధికారులు లాడ్జిలు , పాత నేరస్థులను తనిఖీ చేయాలని తెలిపారు. వర్టికలత్ వారిగా ఎంట్రీ చేసిన డాటాను నోడల్ అధికారులు ప్రతి రోజు తనిఖీ చేసుకోవాలని, క్వాలిటీ డాటా ఎంట్రీ చేయాలని సూచించారు. విధి నిర్వహణలో రోల్ క్లారిటీ, గోల్ క్లారీటి ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డిసిపి అడ్మిన్ మహేందర్, ఎసీపీ దేవారెడ్డి, సీసీ ఆర్బి ఏసిపి చంద్రశేఖర్, ట్రాఫిక్ ఎసీపీ పణిందర్, సీఐలు గురుస్వామి, కిరణ్ , ఎస్‌ఐలు మహేశ్, నరేందర్‌రెడ్డి, వివేక్, బాస్కర్ రెడ్డి, నారాయణ, సీసీఆర్బి , ఐటికోర్ టీమ్ సిబ్బంది తదిరతులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News