Thursday, January 23, 2025

నాన్ బెయిలబుల్ వారెంట్ ఎగ్జిక్యూట్ చేయాలి

- Advertisement -
- Advertisement -
  • లాంగ్ పెండింగ్ ఉన్న కేసులు త్వరగా డిస్పోజల్ చేయాలి
  • కోర్టు ట్రయల్ త్వరగా జరిపించాలి: సిపి శ్వేత

సిద్దిపేట: నాన్ బెయిలబుల్ వారెంట్ ఎగ్జిక్యూట్ చేయాలని సిపి శ్వేత అన్నారు. మంగళవారం పోలీస్ కమీషనర్ కార్యాలయంలో 2019- 23 క్రైమ్ ఆగైనెస్ట్, ఉమెన్ ఫోక్సో కేసులలో ఉమెన్ మర్డర్, ఎస్సీ, ఎస్టీ కేసులలో కోర్టు ట్రయల్ ఏ దిశగా ఉన్నాయో ప్రతి కేసు గురించి ఎసిపిలు, సిఐలు, కోర్డు డ్యూటీ సిబ్బందితో పెండింగ్ కేసుల పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భ ంగా మాట్లాడుతూ కేసులలో నేరస్థుల పూర్తి వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరచాలన్నారు. రౌడీ,కేడి, డిసి , సస్పెక్ట్‌ల, సంఘ విద్రోహ శక్తుల వివరాలను టిఎస్‌కాప్‌లో పొందుపరిచి ప్రతిరోజు వారి కదలికలపై నిఘా పెట్టాలన్నారు. విలేజ్ పోలీస్ ఆఫీసర్ విపిఓ వ్యవస్థను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలన్నారు. 2020/-21 సంవత్సరంలో పెండింగ్ ఉన్న గ్రేవ్ కేసులలో త్వరగా పరిశోధన చేసి చార్జిషీట్ దా ఖలు చేయాలని అండర్ ఇన్వెస్టిగేషన్‌లో ఉన్న కేసులలో అన్ని కోణాల్లో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి కోర్టులో చార్జీషిట్ దాఖలు చేయాలన్నారు.

దొ ంగతనాల కేసుల్లో ప్రతిరోజు కేసుల చేతన గురించి అన్ని కోణాల్లో ఫ్లాన్ ఆప్ యాక్షన్ ఎస్‌ఓపి ప్ర కారం,ఇన్వెస్టిగేషన్ చేసి కేసులు చేదించాలన్నారు. సిసి కెమెరాలను ప్రతి రోజు మానిటర్ చేయాలని పనిచేయని సిసి కెమెరాలను వెంటనే బాగు చేయించాలని సూచించారు. సిసిటిఎన్‌ఎస్‌లో 7 ఇంటి గ్రేటెడ్ ఫార్మ అన్ని పూర్తి చేయాలని సూచించారు. రాత్రి పెట్రోలింగ్ అధికారులు లాడ్జిలు, పాత నేరస్థులను తనిఖీ చేయాలని తెలిపారు. వర్టికలత్ వారిగా ఎంట్రీ చేసిన డాటాను నోడల్ అధికారులు ప్రతి రోజు తనిఖీ చేసుకోవాలని, క్వాలిటీ డాటా ఎంట్రీ చేయాలని సూచించారు. విధి నిర్వహణలో రోల్ క్లారిటీ, గోల్ క్లారీటి ప్రతిఒక్కరికి తెలిసి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు డిసిపి మహేందర్, రమేశ్, సురేందర్ రెడ్డి, సిసి ఆర్బి ఎసిపి చంద్రశేఖర్, సిఐలు జానకి రామ్‌రెడ్డి, కిరణ్, సత్యనారాయణరెడ్డి, గురుస్వామి, రఘుపతి, సర్కిల్ కోర్డు సిడిఓలు, సెషన్స్ కోర్టు లైజనింగ్ హెడ్ కానిస్టేబల్ రాజమల్లు, సిసిఆర్బి సిబ్బంది, భరోసా సెంటర్ సిబ్బంది తదిరతులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News