Monday, December 23, 2024

ఆద్యంతం నవ్వించే టీజర్

- Advertisement -
- Advertisement -

హీరో అల్లరి నరేష్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్ ’ఆ ఒక్కటీ అడక్కు’. మల్లి అంకం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు. భరత్ లక్ష్మీపతి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ఈ వేసవిలో విడుదల కానుంది. మంగళవారం మేకర్స్ సినిమా టీజర్‌ను లాంచ్ చేశారు. హీరో జాతకాన్ని ఒక జ్యోతిష్కుడు చెప్పడంతో ఫన్నీ నోట్‌తో ప్రారంభమవుతుంది. హీరో ఒక తేదీలోపు వివాహం చేసుకోవాలి, లేకపోతే అతను తన జీవితాంతం బ్రహ్మచారిగా మిగిలిపోతాడని జ్యోతిష్కుడు చెప్తాడు.

జ్యోతిష్కుడు చెప్పినట్లే అతని సరిపోయే అమ్మాయి దొరకదు. అలాంటి సమయంలో అతను ఫరియా అబ్దుల్లాను చూస్తాడు. ఆమె కూడా అతని కంపెనీని ఇష్టపడుతుంది. అయితే పెళ్లి ప్రపోజల్ పెట్టగానే ‘ఆ ఒక్కటీ అడక్కు’ అని సింపుల్‌గా చెప్పేస్తుంది. ఆద్యంతం నవ్వించే ఈ టీజర్ సినిమాపై మంచి అంచనాలను నెలకొల్పింది. ఈ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ “చాలా ఆరోగ్యకరమైన కామెడీ చేయాలనే ఉద్దేశంతో కథపై చాలా శ్రద్ధ తీసుకొని ఈ సినిమాని చేశాం. నా బలం కామెడీ. ఈసారి మరింత నవ్వించాలని ఈ సినిమా చేశాం.

మంచి కంటెంట్ వున్న కామెడీ ఎంటర్ టైనర్ ఇది. ఫరియా ఈ సినిమాలో చాలా అద్భుతంగా నటించారు”అని అన్నారు. దర్శకుడు మల్లి అంకం మాట్లాడుతూ “టీజర్ ఎలా అయితే నవ్వుకుంటూ చూశారో ఈ సినిమా కూడా అలానే వుంటుంది. ఫ్యామిలీతో కలసి ఆనందంగా నవ్వుకుంటూ చూడదగ్గ చిత్రమిది”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మాత రాజీవ్ చిలక, అబ్బూరి రవి తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News