Wednesday, January 22, 2025

ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేసే సినిమా

- Advertisement -
- Advertisement -

కామెడీ కింగ్ అల్లరి నరేష్ ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ’ఆ ఒక్కటీ అడక్కు’ తో రాబోతున్నారు. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటించారు. స్టార్ రైటర్ అబ్బూరి రవి చిత్రానికి డైలాగ్స్ అందించారు. అల్లరి నరేష్ చాలా కాలం తర్వాత చేస్తున్న కామెడీ ఎంటర్‌టైనర్ కావడంతో ఈ సినిమాపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. శుక్రవారం ఈ సినిమా గ్రాండ్‌గా విడుదల కానున్న నేపధ్యంలో హీరో అల్లరి నరేష్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “పెళ్లిని ఇప్పటివరకూ ఫన్‌తో చూపించారు.

అయితే ఈ సినిమాలో పెళ్లి వెనుక ఒక సమస్య, స్కామ్, పెళ్లి చుట్టూ జరుగుతున్న కోట్ల వ్యాపారంను వినోదాత్మకంగా చూపిస్తూనే మంచి సందేశం వుంటుంది. సినిమా అంతా ఎంటర్ టైనర్ గా వుంటుంది. చివరి రెండు రీళ్లలో ఎమోషనల్ టచ్ వుంటుంది. -దర్శకుడు మల్లి ఈ కథ చెప్పినపుడు అందులోని పాయింట్ కి చాలా కనెక్ట్ అయ్యాను. నిజజీవితంలో జరిగిన చాలా సంఘటనలని పరిశోధించే ఈ కథని తయారు చేశారు. కథలో సహజత్వం ఉట్టిపడుతుంది. కామెడీ లోనే చక్కని సందేశం వుంది. ప్రస్తుతం పెళ్లి చుట్టూ ఎలాంటి స్కామ్స్ జరుగుతున్నాయనేది ఇందులో చూపించిన తీరు ప్రేక్షకులని ఆలోచింపచేసేలా వుంటుంది. మల్లి ఈ కథని చాలా బలంగా రాసుకున్నారు.

దీనికి రచయితగా అబ్బూరి రవి తోడయ్యారు. కామెడీ, ఎమోషన్ అద్భుతంగా రాశారు. ఈ సినిమాలో చూపించే సందేశం ప్రేక్షకులని కదిలించేలా వుంటుంది. -మల్లి ఈ కథ అనుకున్నప్పుడే హీరోయిన్ ఫరియా అయితే జోడి బావుంటుందని అనుకున్నారు. ఫరియాకి కథ చెప్పడం, ఆమెకు కథ నచ్చి సినిమా చేయడం జరిగింది. -ఈ సినిమాలో యంగ్ కోవై సరళ లాంటి పాత్ర కావాలన్నప్పుడు జామి లివర్‌ని ఎంపిక చేశాం. తను అద్భుతమైన ఆర్టిస్ట్. ’ఆ ఒక్కటీ అడక్కు’ మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఫ్యామిలీ అంతా చూసి సరదాగా ఎంజాయ్ చేసే సినిమా”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News