Friday, December 20, 2024

వరద ముంపు సమస్యకు శాశ్వత చెక్

- Advertisement -
- Advertisement -

సిటీ బ్యూరో: భారీ వర్షాలతో గ్రేటర్‌లో ని లోతట్టు ప్రాంతలు, నాలా పరిసర ప్రాంతాలలో త రుచు తలెత్తుతున్న ముంపు సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధ్ది పనులతో ఈ ఏడాది నగరవాసుల కష్టాలు తీరానున్నాయి. నాలాల సమగ్ర అభివృద్ధి కింద వరద ముంపు నివారణకు శాశ్వత చెక్ పెట్టేందుకు మైనర్, మేజర్ నాలాలతో పాటుగా చెరువుల వల్ల, వచ్చే వరదను అరికట్టేందుకు జిహెచ్‌ఎంసి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని సమగ్ర నాలాల అభివృద్ధి పథకం ద్వారా పూడికతీత, మైనర్ నాలా రిటర్నింగ్‌వాల్, బాక్స్ నిర్మాణాలు, చెరువుల వచ్చే వరదను నియంత్రించేందుకు స్లూస్ నూతన నిర్మాణాలు, మరమ్మతుల పనులను శరవేగంగా కొనసాగించింది.

గత ప్రభుత్వాల నిర్లక్షం కారణంగాలో హైదరాబాద్ మహానగరం తరుచు ముంపు బారిన పడుతుండడంతో ఈ దుస్తితిని అధిగమించేందుకు గత రెండేళ్లుగా ప్రభుత్వం తీవ్ర కృషి చేస్తున్నది. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా హైదరాబాద్ వరదముంపు నివారణకు వివిధ విభాగాలలైనా ఇంజనీరింగ్ మెయింటనె న్స్, ప్రాజెక్టు, యస్‌ఎన్‌డిపి, లేక్‌విభాగాల ద్వారా రూ. 2250 కోట్ల విలువైన పనులను చేపట్టడం ద్వారా ఇంజనీరింగ్ అధికారులు అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఈ పనులు పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు ఎప్పటీకప్పుడు సమిక్షిస్తుండడంతో పనులన్ని యుద్ధ ప్రా తిపదికన కొనసాగాయి.

జిహెచ్‌ఎంసి పరిధిలో కేవలం వరద ముంపు నివారణ కోసమే ఇంజనీరింగ్ మెయింటనెన్స్ ద్వారా రూ.415 కోట్లు, ప్రాజెక్టువిభాగం ద్వారా మరో రూ.1006 కోట్లు యస్‌ఎన్‌డిపి ద్వారా రూ.735 కోట్లతో పాటు చెరువుల మరమ్మతులు కోసం మరో రూ. 94 కోట్లు విలువైన పనులను చేపట్టగా ఇందులో అనేక పనులు పూర్తి కాగా, మిగిలిన అరకొర పనులు సైతం చివరి దశలో ఉన్నాయి.
రూ.747.45 కోట్ల వ్యయంతో మొదటి దశ నాలాల అభివృద్ధి
వరద ముంపు నివారణకు రెండు దశల్లో చేపట్టేందుకు కార్యాచరణ సిద్దంచేసిన అధికారులు గత ఏడాదిన్నర కిత్రమే మొదటి దశ పనులకు శ్రీకారం చుట్టారు. ముందుగా అధిక ముంపు ప్రభావిత ప్రాంతాలకు ప్రాధాన్యతను ఇచ్చారు. ఇందులో భాగంగా జిహెచ్‌ఎంసి పరిధిలో రూ. 747.45 కోట్ల అంచనా వ్యయంతో 36 పనులు చేపట్టారు. ఈ 36 పనులలో 23 పనులు పూర్తి అయ్యాయి. ఇందులో వరద తీవ్రత అధికంగా ఉన్న ఎల్ బి నగర్ జోన్ లో బత్తుల చెరవు నుండి ఇంజా పూర్ నాల సింగరేణి కాలనీ నుండి సరూర్ నగర్ చెరువు వరకు, రుంద్రంగ చెరువు నుండి మూసి నది వరకు, బడ్లగూడ చెరువు నుండి నాగోల్ చెరవు వరకు చేపట్టిన పనులు పూర్తి చేశారు.

అదేవిధంగా కూకట్ పల్లి జోన్ లో కొల్ నాల నుండి కెమికల్ నాల వరకు ఫాక్స్ సాగర్ సర్లస్ కోర్స్ ఛానల్ రెస్తోరేశన్ వరకు , ఫాక్స్ సాగర్ స్లూస్ నుండి వయా వల్వ్ నుండి కెమికల్ నాల వరకు చేపట్టిన పనులను పూర్తి చేశారు. సికింద్రాబాద్ జోన్‌లోని ఫికెట్ నాలాలపై రెండు బ్రిడ్జిల పునర్ నిర్మాణం పూర్తి కావడంతో దాదాపు 100 కాలనీలకు వరద ముంపు నుంచి విముక్తి కలిగించారు. మిగితా జోన్ లో కూడా ముంపు అధికంగా ఉన్న ప్రాంతాల్లో నాలా ల అభివృద్ది పనులు పూర్తి చేసేందుకు అహర్నిశలు కృషి చేయడం ద్వారా దాదాపుగా అన్ని పనులు చిట్ట చివరి దశలో ఉన్నాయి. ఈ రానున్న జూలై నాటికి అన్ని పనులు పూర్తి కానున్నాయని అధికారులు తెలిపారు.
రూ.679 కోట్ల స్టార్మ్ వాటర్ డ్రైన్ అభివృద్ధి పనులు
వరద ముంపు నివారణ చర్యలో భాగంగా గ్రేటర్‌లో పరిధిలో రెండు మీటర్ల లోపు వెడల్పు గల స్టార్మ్ వాటర్ డ్రైన్ కు బాక్స్ డ్రైన్, రెండు మీటర్ల పై బడిన నాల రిటేనింగ్ వాల్, బాక్స్ డ్రైన్ పైప్ డ్రైన్, నిర్మాణాలు చేపట్టారు. రూ.298 కోట ్లఅంచనా వ్యయంతో గత ఏడాది స్టార్మ్ వాటర్ డ్రైన్ మరమ్మత్తులు, నిర్మాణాలతో పాటు నాలా భద్రత చర్యల్లో భాగంగా ఫ్రీ కాస్టు స్లాబ్స్, చైన్ లింక్ మెష్ తదితర 468 పనులు చేపట్టగా 95 శాతం పనులు పూర్తి చేశారు.

అదేవిధంగా గత ఆర్థిక సంవత్సరంలో రూ. 381కోట్లతో 643 పనులు చేపట్టగా ఇందులో సైతం చాల మేరుకు పూర్తి గా మిగిలిన పనులు సైతం చివరి దశకు చేరుకున్నాయి.
రూ.రూ. 48.50 కోట్ల వ్యయంతో పూడిక తీత
నగరంలో చినుకు పడితే చాలు వరద ముంచెత్తుండడంతో ఈ సమస్యను అధిక మించేందుకు ఎప్పటికప్పుడు నాలాల పూడిక తీత పనులను కోనసాగిస్తున్నారు.

గతంలో కాకుండా నాలాల్లో పేరుకొని పో యిన చెత్తను తొలగించేందుకు పూడిక తీత కార్యక్రమం ను ఏడాది పొడువునా నిరంతరంగా కొనసాగిస్తున్నారు. ప్రస్తుత సంవత్సరంలో రూ.48.50 కోట్లవ్యయంతో 350 పనులు చేపట్టగా ఇప్పటి వరకు 3.05 లక్షల క్యూ బిక్ మీటర్ల వ్యర్ధాలను వెలిక్కి తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News