Saturday, December 28, 2024

మిషన్ భగీరథతో తాగునీటికి శాశ్వత పరిష్కారం

- Advertisement -
- Advertisement -

ఇబ్రహీంపట్నం : రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మిషన్ భగీరథ పథకంతో తాగునీటికి శాశ్వత పరిష్కారం చూపించారని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇబ్రహీంపట్నం మండలం డబ్బా గ్రామంలో మంచినీళ్ల పండుగ కార్యక్రమంలో ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో తాగునీటి సమస్యతో దశాబ్దాల పాటు ఇబ్బందులు పడ్డ ప్రజలకు స్వరాష్ట్రంలో మిషన్ భగీరథతో సియం కేసిఆర్ శాశ్వత పరిష్కారం చూపించారని అన్నారు. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ఎం.మకరంద్, ఆర్డీవో వినోద్, ఎంపిపిలు, జెడ్పిటిసిలు, సర్పంచులు, మున్సిపల్ చైర్‌పర్సన్లు, మిషన్ భగీరథ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News