- Advertisement -
కొచ్చి: ప్రముఖ తమిళ నటుడు ధనుష్ గత ఏడాది రూ. 150 కోట్లు పెట్టి చెన్నైలోని తేనాంపేటలో ఉన్న పోయస్ గార్డెన్ ప్రాంతంలో విలాసవంతమైన భవంతి కొన్నారు. ఆ ఇల్లు సూపర్ స్టార్ రజనీకాంత్, మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఇంటికి దగ్గరగా ఉంటుంది.
ఇదిలా ఉంటే ఇటీవల ధనుష్ ఓ డిబేట్ లో ‘‘ నేను పోయస్ గార్డెన్ ఏరియాలో విలాసవంతమైన భవంతి కొనడమే ఓ పెద్ద టాపిక్ అవుతుందనుకుని ఉంటే దానికి బదులు ఓ చిన్న అపార్ట్ మెంటే కొనుక్కుని ఉండేవాడిని. అంటే నాలాంటి వ్యక్తి పోయస్ గార్డెన్ వంటి పోష్ లోకాలిటీలో ఇల్లు కొనకూడదా? వీధిలో పుట్టిన వాడు జీవితాంతం వీధిలోనే ఉండాలా?’’ అన్నారు. ఆయన తన రాబోవు చిత్రం ‘రావణ్’ ఆడియో లాంచ్ కార్యక్రమంలో ఈ విషయం ప్రస్తావించారు.
- Advertisement -