Friday, December 20, 2024

అర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

చేగుంట: కుటుంబ పోషణ, ఆర్థిక ఇబ్బందులతో మనస్థాపం చెంది వ్యక్తి ఊర చెరువులో మునిగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చేగుంటలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన ఈప్తి ఎల్లయ్య (30) గత 10 సంవత్సరాల క్రితం ఈప్తి సునీతతో వివాహం జరిగింది. 10 సంవత్సరాలుగా పిల్లలు పుట్టకపోవడం, కుటుంబ పోషణబారం కావడం ఆర్థికంగా లేక పోవడం వల్ల ఎప్పుడు బాధపడేవాడని గత రాత్రి ఇదే విషయంలో భార్యతో గొడవ తీసి మొటర్ సైకిల్‌పై 8 గంటలకు బయటకు వెళ్ళి రాత్రి 10 గంటలైనా ఇంటికి రాకపోవడంతో చుట్టు ప్రక్కల వేతకగా చేగుంట ఊర చెరువు వద్ద మోటర్ సైకిల్, మొట్ల వద్ద చెప్పులు ఉండడం చూసి కులస్తులతో వెతికించగా చెరువులో ఎల్లయ్య శవం లభ్యమైంది. ఈ విషయమై భార్య ఫిర్యాదుతో శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేట ఎరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ ప్రకాష్ గౌడ్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News