- Advertisement -
తూప్రాన్: తూప్రాన్ మండలం ఇస్లాంపూర్ గ్రామానికి బతుకుదెరువు కోసం వచ్చి నివాసం ఉంటున్న శివ్వంపేట మండలం గుండ్లపల్లికి చెందిన విబూతి సురేష్(28) అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో గొడవలు, ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక ఇస్లాంపూర్ శివారులో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తూప్రాన్ ఎస్‌ఐ సురేష్‌కుమార్ తెలిపారు. శనివారం సాయంత్రం పొయ్యిలకు కట్టెలు తీసుకురావడానికి వెళ్లిన సురేష్ గ్రామ శివారులో చెట్టుకు ఉరేసుకుని కనిపించినట్లు తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.
- Advertisement -