Friday, December 20, 2024

ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

దుబ్బాక: ఆర్థిక ఇబ్బందులు, భార్య భర్తల గొడవల కారణంగా ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన తాళ్ళపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. దుబ్బాక నియోజకవర్గం పరిధిలోని అక్బర్ పేట-భూంపల్లి మండలం తాళ్ళపల్లి గ్రామానికి చెందిన గెరిగంటి శ్రీకాంత్ ఫొటో గ్రాఫర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. గత కొద్ది సంవత్సరాలుగా ఫోటో ఫీల్ తగ్గడంతో కుటుంబ పోషణకు ఖర్చులు పెరగడంతో అప్పులపాలైనాడు. చేతినిండా పని లేక అప్పులు పెరగడంతో మధ్యానికి బానిసై భార్య శ్యామల తో తరచూ గొడవపడేవాడు. సోమవారం సాయంత్రం మధ్యం సేవించి భార్యతో గొడవ పడి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. రాత్రి వరకు ఇంటికి రాకపోవడంతో భర్త శ్రీకాంత్ కు భార్య శ్యామల ఫోన్ చేయగా నేను చనిపోతున్నానని చెప్పాడు. గ్రామస్తులతో కలిసి రాత్రి వెతుకగా వ్యవసాయ పొలం వద్ద చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు భూoపల్లి ఎస్త్స్ర గంగరాజు తెలిపారు. భార్య శ్యామల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News