Thursday, January 23, 2025

మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

వెంకటాపురం(నూగూరు): మండలంలోని ఆలుబాక గ్రామంలో మంగళవారం మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడిన సంఘటన చోటు చేసుకుంది. వెంకటాపురం ఎస్‌ఐ అశోక్ తెలిపిన వివరాల ఇలా ఉన్నాయి. ఆలుబాక గ్రామానికి చెందిన ఎర్రమాటి సూర్యనారాయణ(46) అనే వ్యక్తి రామచంద్రాపురం గ్రామంలో ఈ నెల 20 తేదిన తమ బంధువుల ఇంట్లో జరిగిన పుట్టిన రోజు వేడుకలను కుటుంబ సమేతంగా హాజరయ్యారని తెలిపారు.

కాగా పుట్టిన రోజు వేడుకల్లో మద్యం సేవించి కార్యక్రమం ముగించుకొని ద్విచక్ర వాహనం ఇంటికి వెళుతున్న క్రమంలో రాత్రి 11 గంటలో సమయంలో సూర్యనారాయణ తమ బంధువులు కారును వెనుక నుండి ఢీ కొట్టడంతో కారు డ్యామెజి అయినట్లు తెలిపారు. దీనితో కుటుంబ సభ్యులు మందలించడంతో మనస్థాపానికి గురై రాత్రి ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడిస్తున్న తెలిపారు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిర్వహించి సోమవారం వెంకటాపురం వైద్యశాలకు తరలించారని తెలిపారు.

వెంకటాపురం ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స నిర్వహించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్య కోసం భద్రాచలం రిఫర్ చేయడంతో భద్రాచలం తీసుకువెళుతున్న క్రమంలో మార్గమద్యంలో మృతి చెందినట్లు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News