Monday, December 23, 2024

ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

మదనపురం : ప్రమాదవశాత్తు కదులుతున్న రైలు నుంచి జారి కిందపడి వ్యక్తి మృతి చెందిన సంఘటన వనపర్తి జిల్లాలోని వనపర్తి రోడ్డు, పేరూర్ రైల్వే స్టేషన్ల మధ్య కొన్నూరు గ్రామ శివారులో చోటు చేసుకుంది. రైల్వే హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ కథనం ప్రకారం గద్వాల పట్టణం రెవెన్యూ కాలనీకి చెందిన మహమ్మద్ షమీ(47) ఉపాధి కోసం మహబూబ్‌నగర్‌లో ఉంటున్నాడు. గత పది రోజుల క్రితం తన సోదరుడు అజర్ ఇంట్లో శుభాకార్యం ఉండగా గద్వాలకు వచ్చి సోమవారం సాయంత్రం తిరిగి మహబూబ్‌నగర్ వెళ్తానని బయల్దేరి గుర్తు తెలియని రైల్‌లో ప్రయాణం చేస్తూ వనపర్తి రోడ్డు, పేరూర్ రైల్వే స్టేషన్ల మధ్య కొన్నూరు గ్రామ శివారులో ప్రమాదవశాత్తు కదులుతున్న రైలులో నుంచి జారిపడడంతో తలకు బలమైన గాయాలు, కుడిచెయ్యి విరిగి అక్కడికక్కడే మరణించినట్లు తెలిపారు.

పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఆయన తెలిపారు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే కానిస్టేబుల్ రామకృష్ణ తెలిపారు.
22ఎన్‌జిపిహెచ్ ః మహమ్మద్ షమీ మృతదేహం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News