Monday, December 23, 2024

గూడ్స్‌రైలు కిందపడి వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

జమ్మికుంట: జమ్మికుంట రైల్వేస్టేషన్ ఆగిఉన్న గూడ్స్ రైలుకిందపడి సముద్రాల రాజేష్(41)అనే వ్యక్తి మృతిచెందనట్లు రామ గుండం రైల్వే హెడ్ కానిస్టేబుల్ తిరుపతి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఇంక్లైన్ బస్తీకి చెందిన సముద్రాల రాజేష్ టెంట్‌హౌస్‌లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.

హన్మకొండ జిల్లా కమలాపూర్‌లో బం ధువు మృతి చెందగా అంత్యక్రియలలో పాల్గొని తిరుగు ప్రయాణంలో జమ్మికుంట రైల్వేస్టేషన్‌లోని 3వ నంబర్ ఫ్టాట్ ఫాంపై ఆగి ఉన్న గూడ్స్ రైలుకింద నుంచి ఫ్లాట్ ఫాం ఎక్కి ప్రయత్నం చేస్తుండగా రైలు కదలడంతో దానికింద పడిపోవడంతో రెండుచేతులు తెగిపోయి తీవ్ర రక్తస్రావం అయి ప్రాణాపాయ స్థితిలో ఉండగా 108వాహనం ద్వారా హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చే ర్పించగా చికిత్స పొందుతూ మృతిచెందినట్లు వివరించారు.

మృతుడి భార్య సముద్రాల సత్తమ్మ, కొడుకు, కూతురు ఉన్నారు. మృ తుడి భార్య సత్తమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తిరుపతి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News