Monday, January 20, 2025

చెరువులో పడి వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

గాందారి : గాందారి మండలం సర్వాపూర్ గ్రామానికి చెందిన హన్మాండ్లు అనే వ్యక్తి ప్రమాద వశాత్తు చెరువులో పడి మృతి చెందినట్లు ఎస్సై సుధాకర్ తెలిపారు. గాందారి మండల కేంద్రానికి చెందిన మొగులయ్య ఇంటికి హన్మాండ్లు ఇల్లరికం వచ్చాడు. 9 వ తేదీ బుధవారం ఇంటి నుండి బయటకు వెళ్లి వస్తానని భార్య మోహన్‌గాందీతో చెప్పి వెళ్లి తిరిగి రాలేదు. బందువుల వద్ద విచారించగా ఆచూకి లబించలేదు.

గురువారం సీతాయిపల్లిలో గల చెరువులో శవమై కనిపించాడు. హన్మాండ్లుకు కొంత కాలంనుండి ఫిట్స్ వ్యాధితో బాధపడుతుంన్నాడు. అదే క్రమంలో కాలకృత్యాలకు వెళ్లి ఫిట్స్ వచ్చి చెరువులో పడి మరణించి ఉంటాడని కుటుంబ సభ్యులు ఫిర్యాధులో పేర్కొన్నారని తెలిపారు. మృతుడి మేన మామా గంగాధర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News