Thursday, January 23, 2025

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

నల్లగొండ: లారీని ఢీ కొట్టి వ్యక్తి మృతి చెందిన సంఘటన పెద్దవూర మండల కేంద్రంలోని చౌరస్తా సమీపంలో గురువారం రాత్రి 9 గంటల సమయంలో చోటు చేసుకుంది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పెద్దవూర మండలం పెద్దగూడెం గ్రామానికి చెందిన మల్లికార్జున ఫంక్షన్ హాల్ ఓనర్ మల్ రెడ్డి నారాయణరెడ్డి తన బైక్ పై పెద్దగూడెం గ్రామం నుండి పెద్దవూర చౌరస్తా సమీపంలోకి రాగానే ఆగి ఉన్న లారీని వెనుక నుండి ఢీకొట్టడంతో తలకు తీవ్ర గాయాలయి అక్కడికక్కడే మృతి చెందాడని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పెద్దవూర ఎస్ఐ పరమేష్ తెలిపారు.

మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News