Wednesday, January 22, 2025

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట:కోదాడ మండల పరిధిలోని ఎర్రవరం స్టేజీ వద్ద లారీ, బైక్‌ను ఢీకొని ఒక వ్యక్తి మృతిచెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. కోదాడరూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గణపవరం గ్రామానికి చెందిన పొట్ట శ్రీను అనే అతను ముత్యాలమ్మ పండుగ చేసుకునేందుకు వారి కుటుంబ సభ్యులను ఆటోలో పంపించి అతను బైక్ మీద కందిబండ వెళ్లుతున్నాడు.

ఈ క్రమంలో మార్గం మధ్యలో మేళ్ళచెర్వు నుండి కోదాడ వైపు వస్తున్న లారీ వేగంగా బైక్‌ను డీకొనటంతో శ్రీనుకి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే అతనిని హుఠాహుటిగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే మార్గం మద్యలో మృతిచెందాడు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీను మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించి పంచనామా చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News