Sunday, December 22, 2024

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

కారేపల్లి : రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం పాలైన ఘటన ఖమ్మం ఇల్లందు ప్రధాన రహదారిపై ఊట్కూరు స్టేజీ సమీపంలో ఆదివారం ఉదయం జరిగింది. కారేపల్లి ఎస్‌ఐ పుష్పాల రామారావు తెలిపిన వివరాల ప్రకారం కారేపల్లి మండల పరిధిలోని చింతలపాడు తండాకు చెందిన వాంకుడోత్ శోభన్ ఖమ్మంలో సుతారి మేస్త్ర గా పనిచేస్తున్నాడు.

ఆదివారం ఉదయం ఖమ్మం నుండి చింతలపాడు తండాకు స్కూటీపై వెళుతూ ఉండగా గేదలు అడ్డు రావడంతో పక్కకు తప్పించబోయి స్కూటీని విద్యుత్తు స్తంభానికి ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి, భార్య మౌనిక, ఒక బాబు, ఒక పాప ఉన్నారు. మృతుని భార్య మౌనిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. కాగా శోభన్ మృతితో చింతలపాడు తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News