Sunday, January 19, 2025

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

మేడ్చల్: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీస్ లు తెలిపిన వివరాల ప్రకారం విక్రంపురం గ్రామం పార్వతీపురం మండలంకు చెందిన కలిషెట్టి జగదీష్ (35) సంగారెడ్డి జిల్లా హత్నుర పరిధిలోని ఎన్‌సిఎల్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ అక్కడే కంపెనీ క్వార్టర్స్ లో నివాసం ఉంటున్నాడు. జగదీష్ తన బంధువుల అబ్బాయి కీసర సమీపంలోని డిఫెన్స్ అకాడమీలో చదువుకుంటున్నాడు.

తనను కలిసేం దుకు ఆదివారం ఉదయం హత్నూర నుండి తన స్నేహితుడు కిరణ్ తో కలి సి ద్విచక్ర వాహనంపై కీసరకు వెళుతుండగా మార్గమధ్యంలోని మేడ్చల్ ఔటర్ రింగ్‌రోడ్ సమీపంలో రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన ఓ గుర్తు తెలియని లారీ ఢీ కొట్టింది. దీంతో ద్విచక్ర వాహనంపై నుండి కింద పడిపోయిన జగదీష్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. ద్విచక్ర వాహనం వెనకాల కూర్చున్న కిరణ్‌కు స్వల్ప గాయాలయ్యాయి. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జగదీష్ మృతదేహానికి మేడ్చల్ ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతుడి బంధువులకు అప్పగిం చారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా మృతుడికి భార్య, కూతురు ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News