Monday, December 23, 2024

రోడ్డు ప్రమాదంతో వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

చేగుంట: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా చేగుంట పోలీస్‌స్టేషన్ పరిధిలోని రామంతపురం జాతీయ రహదారి 44పై చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శి వ్వంపేట మండలం గోమారం గ్రామానికి చెందిన పందిముక్కల నర్సింగ్ గౌడ్ (43) చేగుంట మండలం కర్నాల్‌పల్లి ఎల్లమ్మ దేవాలయం వద్ద తన బ ంధువుల శివకుమార్‌గౌడ్ కుమారుని పుట్టు వెంట్రుకల పంక్షన్ కోసం వచ్చి తన బైక్‌పై నర్సింగ్‌గౌడ్ తిరుగు ప్రయాణంలో రామంతపురం గ్రామ శివారులోని లారీ ఢీకొట్టడంతో తలకు తీవ్రగాయాలు కాగా అతన్ని చికిత్స కోసం హైదరాబాద్ తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. భార్య లత ఫిర్యాదుతో కేసు నమోదు చేసి శవాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఏరియా అసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ప్రకాష్ గౌడ్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News