Wednesday, January 22, 2025

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

దండేపల్లి : దండేపల్లి మండలం రెబ్బనపల్లి గ్రామానికి చెందిన గాలిపల్లి గురువయ్య (60) శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు ఎస్సై ప్రసాద్ తెలిపారు. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం సంఘటన వివరాలు ఇలా ఉన్నా యి. గాలిపల్లి గురువయ్య ఉదయం ఇంటి నుంచి సైకిల్‌పై ముత్యంపేటకు వెళ్లాడు.

తిరిగి ముత్యంపేట నుండి సైకిల్‌పై ఇంటికి వస్తుండగా పెట్రోల్ బంక్ వద్ద వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కారు డ్రైవర్ అతి వేగంగా, అజాగ్రత్తగా నడపడంతోనే ప్రమాదం జరిగిందని మృతుని భార్య గాలిపల్లి గౌరక్క చేసిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News