Monday, January 20, 2025

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి : యాదగిరిగుట్ట మండలం పెద్దక ందుకూరు సమీపంలో మహేంద్ర బొలేరో ట్రావెల్ ట్రక్కు చెట్టుకు ఢీకొట్టి బొంతు శ్రీనివాస్ (40) మృతి చెందాడు. బుధవారం సీఐ తెలిపిన వివరాల ప్రకారం వరంగల్ జిల్లా నెక్కొండ మండలం గుండ్రపల్లి గ్రామానికి చెందిన మృతుడు బొంతు శ్రీనివాస్ వలిగొండ నుండి స్వగ్రామానికి మహేంద్ర బొలేరో ట్రావెల్ ట్రక్కు( టిఎస్ 24టి5674)లో వెళ్తుండగా తెల్లవారుజామున 5 గంటల సమయంలో నిద్రమత్తులో మండలంలోని పెద్దకందుకూరు స మీపంలో చెట్టుకు ఢీకొని అక్కడికక్కడే చనిపో యినట్లు తెలిపారు.

వాహనంలో ఉన్న ఇలియాస్ అనే వ్యక్తికి గాయాలు కాగా, ఆలేరు ఆస్పత్రి కి తరలించినట్లు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం బొంతు శ్రీనివాస్ మృతదేహాన్ని బంధువులకు అప్పగించినట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News