Friday, December 20, 2024

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

తాండూర్: తాండూర్ మండలంలోని బోయపల్లి బోర్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో అల్లకోండ పోశం (50) అనే వ్యక్తి మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే ఆసిఫాబాద్ నుండి బెల్లంపల్లి వైపుకు వస్తున్న కారు కాలినడకన రోడ్డు దాటుతున్న పోషన్నను వేగంగా ఢీ కోట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

పోశం తాండూర్ మండల కేంద్రంలోని పోచంపల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా కూలి పని చేసుకోని ఉండేవాడని అన్నారు. మృతుడి కుమారుడు రవితేజ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తూ చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News