Sunday, December 22, 2024

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/మఠంపల్లి : తప్పిపోయాడనుకున్న వ్యక్తి శవమై తేలిన సంఘటన మండల కేంద్రంలో బుదవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు,పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రంలో అనుమానాస్పద స్ధితిలో ఆంద్రప్రాంతం దాచేపల్లి మండలం సారంగపల్లి అగ్రహారం గ్రామానికి చెందిన గల్లా నతానియేలు మఠంపల్లి మండల కేంద్రంలోని హెచ్‌పి పెంట్రోల్‌బంక్ ప్రక్కన ఉన్న పంజాబీ దాబాలో స్నేహితులతో కలిసి మధ్యం సేవించి,అల్పాహారం తిన్నాడు.

అదేరోజు ఇంటికి రావపోవడంతో తల్లిదండ్రులు మంగళవారం పోలీస్‌స్టేషన్‌లో పిర్యాదు చేశారు. బుదవారం ఉదయం పంజాబీదాబా వెనకభాగంలో ఉన్న మురికి గుంటలో శవమై కనిపించాడు. తండ్రి ప్రసాద్‌రావు పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఇరుగు రవి తెలిపారు. మృతుడికి భార్య,ఇద్దరు పిల్లలు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News