షాబాద్: అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన షాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ గురువయ్యగౌడ్ తెలిపిన వివరాల మేరకు… షాబాద్‌కు చెందిన తొంట వెంకటయ్య దైవాలగూడ గ్రామానికి వెళ్లె దారిలో ఓ ఫంక్షన్ హాల్ కట్టిస్తున్నాడు. కాగా కాంట్రాక్టు నిమిత్తంహైదరాబాద్ ఫలక్‌నామాకు చెందిన మహ్మద్ షబ్బీర్‌కు ఇచ్చాడు. నెల రోజుల నుండి కాంట్ట్రార్ ఇక్కడ ఐదు మంది కూలీలను పెట్టి పనులు చేయిస్తున్నాడు.
ముగ్గురు కూలీలు ఇంటికి వెళ్లారు. ఇక్కడ రహీంఖాన్, రోహిత్‌కుమార్‌లు మాత్రమే పనిచేస్తున్నారు.మంగళవారం ఉదయం వాచ్‌మెన్ ఫోన్ చేసి ఫంక్షన్‌హాల్‌లో ఓ కూలీ చనిపోయి ఉన్నాడని చెప్పాడు. దీంతో వెంటనే తొంట వెంకటయ్య అక్కడకు చేరుకొని చూడగా రోహిత్‌కుమార్ తలకు తీవ్రగాయాలతో కనిపించాడు.
ఫంక్షన్‌హాల్‌లో ఇద్దరు ఉండడంతో రహీంఖాన్ కొట్టి చంపి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రహీంఖాన్ పరారీలో ఉన్నాడు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ గురువయ్యగౌడ్ తెలిపారు.