Thursday, January 23, 2025

గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

జ్యోతినగర్: ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ పరిధిలోని పికె రామయ్య కాలనీలో ఒక వ్యక్తి ఆ ప్రాంతంలో ఉండే కార్మికులకు, అమాయక యువకులకు గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్నారని నమ్మదగినసమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ సిఐ కృష్ణ, ఎన్టీపీసీ ఎస్‌ఐ జీవన్ సిబ్బంది సంయుక్తంగా ఎన్టీపీసీ ఇందిరమ్మ కాలనీ వద్ద జూల రాంబాబు అనే వ్యక్తిని అతని ఇంటి ఆవరణలో పట్టుకున్నారు.

అతన్ని విచారించగా, 900 గ్రామాలు గంజాయి లభించిందని తెలిపారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే దురుద్దేశ్యంతో గుర్తు తెలియని వ్యక్తి వద్ద గంజాయి కొనుగోలు చేసి పికె రామయ్య కాలనీలో కార్మికులకు, అమాయకపు యువతకు అమ్ముతున్నాడని తెలిపారు.అతన్ని పోలీస్ స్టేషన్‌కు తరలించి, కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News