- Advertisement -
హైదరాబాద్: దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్‌కుమార్‌కు హోంగార్డులు వినతి పత్రం సమర్పించారు. వినోద్‌కుమార్‌ను ఆయన కార్యాలయంలో మంగళవారం కలిసి సమస్యలతో కూడిని వినతిపత్రాన్ని సమర్పించారు. హోంగార్డుల సమస్యలు తెలంగాణ ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తానని చెప్పినట్లు హోంగార్డుల సంఘం సైబరాబాద్ అధ్యక్షుడు అశోక్ తెలిపారు. తమ సమస్యలపై సానుకూలంగా స్పందించిన తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌కు హోంగార్డులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో హోంగార్డులు కొత్వాల్ దయానంద్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -